Baghdad Protests: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో హింసాత్మక ఘర్షణలు.. భద్రతా దళాల కాల్పులు.. 15 మంది మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో 15 మంది నిరసనకారులు మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాకీ షియా మతగురువు ముక్తాదా అల్-సదర్ రాజకీయ జీవితం నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించిన తర్వాత ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

Baghdad Protests
Baghdad Protests: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో 15 మంది నిరసనకారులు మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాకీ షియా మతగురువు మొఖ్తదా అల్ సదర్ రాజకీయ జీవితం నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించిన తర్వాత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయితే భద్రతా దళాలు టియర్ గ్యాస్, లైవ్ బుల్లెట్లను కాల్చడం ద్వారా నిరసనకారులను ఇరాక్ యొక్క రిపబ్లికన్ ప్యాలెస్ నుండి బయటకు తరిమేశాయని పలువురు సాక్షులు చెప్పారు. అల్-సదర్ ప్రకటన తర్వాత వందలాది మంది నిరసనకారులు గ్రీన్ జోన్‌లోని భవనంపైకి దూసుకెళ్లారని ఇరాక్ భద్రతా అధికారులు తెలిపారు.
Baghdad Bomb Blast : బాగ్దాద్‌లో బాంబు పేలుడు, 35మంది మృతి
ఇరాక్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. నెలల తరబడి నూతన ప్రభుత్వం ప్రధాని, అధ్యక్షుడు లేకుండానే తాత్కాలిక ప్రధాని మస్తఫా అల్ ఖదేమీ ఆధ్వర్యంలో ఆ దేశంలో పాలన సాగుతోంది. ఆ దేశంలో ఎన్నికల జరిగి నెలలు గడుస్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే ప్రో- ఇరాక్ కో- ఆర్డినేషన్ ఫ్రేం వర్క్ అన్ని పార్టీలతో కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముస్తఫా అల్ ఖదేమీని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకుంది. దీన్ని మొఖ్తదా సదర్ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో పలుసార్లు గ్రీన్ జోన్ ను ముట్టడించారు. ఎన్నికల ఫలితాల్లో సదర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సీట్లు సాధించలేక పోయింది. ప్రభుత్వం ఏర్పాటుపై ఆయన విపక్షాలతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.
తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మొఖ్తదా అల్ సదర్ ప్రకటించగానే ఆయన మద్దతు దారులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. మాజీ మంత్రి, మాజీ-ప్రావిన్షియల్ గవర్నర్ మహమ్మద్ అల్-సుడానీ అభ్యర్థిత్వాన్ని నిరసనకారులు వ్యతిరేకించారు. పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకెళ్లి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మరోవైపు కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ ఈ దాడిని ఖండించింది. ఇదిలాఉంటే రిపబ్లికన్ ప్యాలెస్‌లో ఇరాకీ మంత్రివర్గం సమావేశమవుతుందని, తదుపరి నోటీసు వచ్చేవరకు ప్రభుత్వం అన్ని సమావేశాలు, కార్యక్రమాలను నిలిపివేసినట్లు తాత్కాలిక ప్రధాన మంత్రి ముస్తఫా అల్ ఖదేమీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నిరసనకారులు సంయమనం పాటించాలని, చర్చలకు రావాలని సూచించారు. పోలీసులు, భద్రతా దళాలు కాల్పులు జరపకుండా తాత్కాలిక ప్రధాని నిషేధం విధించారు. అందరూ శాంతియుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.