అబ్బురపరుస్తున్న వీడియో.. తోటి విద్యార్థి కోసం ఈ చిన్నారులు ఎంత గొప్ప పనిచేశారో తెలుసా?

చిన్నారులు ఎప్పటికీ ఇలాగే సాయం చేసుకుంటూ మానవత్వం అంటే ఏంటో ప్రపంచానికి చూపాలని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.

అబ్బురపరుస్తున్న వీడియో.. తోటి విద్యార్థి కోసం ఈ చిన్నారులు ఎంత గొప్ప పనిచేశారో తెలుసా?

Nepal School Students Raise Funds

Updated On : February 9, 2025 / 1:55 PM IST

చిన్నారుల హృదయాలు స్వచ్ఛమైనవి. తోటి పిల్లాడికి ఏదైనా బాధ కలిగితే అది తమ బాధలాగా భావిస్తారు చాలా మంది పిల్లలు. స్నేహితులకు సాయం చేస్తూ అంత చిన్న వయసులోనే మానవత్వాన్ని చాటుకుంటారు.

ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. కొందరు చిన్నారులు తరగతి గదిలోనే తమ తోటి విద్యార్థికి చేసిన సాయం గురించి తెలుసుకుని ఆ పిల్లలకు సెల్యూట్ అని అంటున్నారు.

Also Read: కొడుకు జైలుకు వెళ్తాడని భయపడి.. నిజాన్ని పంటిబిగువున బిగపట్టి.. బాధను గుండెల్లోనే దాచుకున్న తల్లి

నేపాల్‌లోని స్మాల్ హెవెన్ స్కూల్‌లో విద్యార్థులను పిక్నిక్‌ తీసుకెళ్లడానికి స్కూల్‌ యాజమాన్యం డబ్బులు కలెక్ట్‌ చేస్తోంది. అయితే, ఓ తరగతిలో ప్రిన్స్‌ అనే ఓ చిన్నారి వద్ద డబ్బులు లేకపోవడంతో అతడు పిక్నిక్‌కు రాలేకపోతున్నాడని తోటి చిన్నారులు గుర్తించారు.

తమ స్నేహితుడిని ఎలాగైనా పిక్నిక్‌కు తీసుకువెళ్లాలని భావించి అందరూ కలిసి డబ్బులు వేసుకుని అతడికి ఇచ్చారు.
ఈ వీడియో ఆ చిన్నారుల క్లాస్‌ టీచర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ఆ చిన్నారులు ఎప్పటికీ ఇలాగే అందరికీ సాయం చేస్తూ ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. చివరికి ప్రిన్స్‌ పిక్నిక్‌కు వెళ్లి తోటి విద్యార్థులతో ఎంజాయ్‌ చేశాడు. ఆ చిన్నారులకు సంబంధించిన వీడియో చూస్తే కన్నీరు వస్తోందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.