Volodymyr Zelensky: పుతిన్‌ను సన్నిహితులే చంపేస్తారు.. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

‘ఇయర్’ పేరుతో విడుదలైన ఈ డాక్యుమెంటరీలో జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘రష్యాలో పుతిన్ అధ్యక్ష పదవికి, నాయకత్వానికి కచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది. వేటగాడిని వేటగాళ్లే అంతం చేస్తారు. హంతకుడిని చంపేందుకు ఒక కారణం కనుక్కుంటారు.

Volodymyr Zelensky: పుతిన్‌ను సన్నిహితులే చంపేస్తారు.. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

Updated On : February 27, 2023 / 3:23 PM IST

Volodymyr Zelensky: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఏదో ఒక రోజు ఆయన సన్నిహితులే చంపేస్తారని అభిప్రాయపడ్డారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తైన సందర్భంగా ఒక డాక్యుమెంటరీ విడుదలైంది.

Ayyanna Patrudu: సుప్రీం కోర్టులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుకు ఎదురుదెబ్బ.. ఫోర్జరీ కేసు విచారణకు అనుమతి

‘ఇయర్’ పేరుతో విడుదలైన ఈ డాక్యుమెంటరీలో జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘రష్యాలో పుతిన్ అధ్యక్ష పదవికి, నాయకత్వానికి కచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది. వేటగాడిని వేటగాళ్లే అంతం చేస్తారు. హంతకుడిని చంపేందుకు ఒక కారణం కనుక్కుంటారు. రష్యాకు చెందిన వ్లాదిమిర్ కొమరోవ్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారనుకుంటున్నా. ఆయన మాట ప్రకారం.. హంతకుడిని చంపేందుకు వాళ్లు ఒక కారణం కనుగొంటారు. అది పని చేస్తుందా? అంటే అవుననే చెబుతా. అయితే, అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేను’’ అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసేందుకు ఒక కారణం ఉంది.

Brawl Over DJ: డీజే విషయంలో గొడవ.. పెళ్లి బృందంపై హోటల్ సిబ్బంది దాడి.. వీడియో వైరల్

కొంతకాలంగా రష్యన్లలో పుతిన్‌పై అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆయన సన్నిహితులే ఆయనపై కోపంతో ఉన్నారు. యుక్రెయిన్ యుద్ధ భాగం నుంచి రష్యన్ సైనికులు ఏడుస్తూ, ఫిర్యాదులు చేస్తూ ఉన్న వీడియోలు అక్కడ వైరల్ అవుతున్నాయి. ఈ పరిస్థితికి కారణమైన పుతిన్‌పై అనేక మంది అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడమే యుద్ధానికి అసలైన ముగింపు అని జెలెన్‌స్కీ అన్నారు.