Human Lifespan : మనిషికి మరణం లేదా? ఎన్నేళ్లైనా బతకొచ్చా? పరిశోధనలో ఆసక్తికర విషయాలు
ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఇది సత్యం. పుట్టుకలు చావులు సర్వ సాధారణం. అది మనిషి అయినా, జంతువైనా అంతే. అయితే, దీర్ఘకాలం ఆరోగ్యంగా బతకాలని కోరుకోని

Human Lifespan
Human Lifespan : ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఇది సత్యం. పుట్టుకలు చావులు సర్వ సాధారణం. అది మనిషి అయినా, జంతువైనా అంతే. అయితే, దీర్ఘకాలం ఆరోగ్యంగా బతకాలని కోరుకోని మనుషులు ఉండరు. భూమి మీద చావనేది లేకుండా ఉండిపోవాలనీ కలలు కనే వారుంటారు. మరి అమరత్వం సాధ్యమేనా? మనిషి జీవనకాలానికి పరిమితి లేదా? ఎన్నాళ్లైనా బతకొచ్చా? తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్ లో పబ్లిష్ అయిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి. అసలు మనిషి జీవనకాలానికి పరిమితి లేదని పరిశోధనలో వెల్లడైంది. ఇప్పటివరకూ ఫ్రెంచ్ మహిళ, చైన్ స్మోకర్ జీన్ కాల్మెంట్ ఒకరు ఈ దిశగా అడుగులు వేశారు.
Caffeine : టీ,కాఫీలలో ఉండే కెఫిన్ వల్ల ఆరోగ్యానికి నష్టమా?..లాభమా?..
1997లో మరణించే నాటికి ఆమె వయసు 122 ఏళ్లు 164 రోజులు. ప్రపంచంలో అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా ఆమె రికార్డులకు ఎక్కారు. వయసు మీదపడ్డాక చనిపోతామనే భయాలు, అపోహలు పక్కనపెడుతూ వందేళ్లు పైబడి హాయిగా జీవిస్తున్న వారు క్రమంగా పెరుగుతున్నారు. మానవ శరీరానికి నిజంగా గడువు తీరే తేదీ ఉంటుందా..? అదే ఉంటే సిద్ధాంతపరంగా మనిషి నిరంతరం జీవించి ఉండే అవకాశాలూ లేకపోలేదనే దిశగా పరిశోధకులు అధ్యయనాల్లో మునిగితేలుతున్నారు.
Basil : తులసితో మానసిక ఒత్తిడి మాయం..!
గతంలో గోంపెజ్ ఈక్వేషన్ ఆధారంగా మనిషి అత్యధికంగా 140 ఏళ్లు జీవించవచ్చని లెక్కకట్టగా, ఈ ఏడాది ఆరంభంలో వెల్లడైన మరో అధ్యయనం 150 ఏళ్ల వరకూ మనిషి బతికేయవచ్చని అంచనా వేసింది. ఇక గతవారం రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా పరిశోధన మనిషికి గరిష్ట జీవనకాలం అంటూ లేదని తెలిపింది.
110 ఏళ్లు పైబడిన సూపర్ సెంచూరియన్లు, 105 ఏళ్లు పైబడిన శతాధిక వృద్ధుల తాజా గణాంకాలను పరిశీలించిన మీదట మనిషి 110 ఏళ్లకు చేరిన తర్వాత మరణించే ముప్పు 50-50గా ఉంటుందని అధ్యయన సహ రచయిత ఆంధోని డేవిసన్ తెలిపారు. 110 ఏళ్లకు చేరిన తర్వాత మరో ఏడాది బతకడం లేదా మరణించడం అనేది ఇరువైపులా ఉండే నాణెంతో సమానమని చెప్పుకొచ్చారు. మొత్తం మీద మానవాళి జీవనకాలానికి పరిమితి అంటూ లేదని పరిశోధకులు తేల్చారు.