యుద్ధ మేఘాలు : అమెరికాపై ఇరాన్ ప్రతికారం

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మరోసారి రాకెట్ల మోత మోగింది. అమెరికా బలగాలే లక్ష్యంగా రెండు చోట్ల రాకెట్ దాడులకు పాల్పడింది ఇరాన్. గ్రీన్ జోన్ పరిధిలో రాకెట్ల దాడులతో కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులతో పాటు పలువురు అమెరికా సైనిక సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా దాడి చేసిన మరునాడే ఈ ఘటన చోటు చేసుకుంది.
అగ్రరాజ్య రాయబార కార్యాలయం ఉండే గ్రీన్‌జోన్ పరిధిలో శనివారం సాయంత్రం రెండు మోర్టార్దాడులు జరిగాయి. అనంతరం ఉత్తర బాగ్దాద్‌లో అమెరికా బలగాలు మోహరించి ఉన్న బాలాద్ వైమానిక స్థావరంపై రెండు కాట్యుషా రాకెట్లతో విరుచుకుపడ్డారు. అప్రమత్తమైన అధికారులు డ్రోన్ల సహాయంతో పరిసర ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం సొలేమాన్‌ను అమెరికా హతమార్చినప్పటి నుంచి పగతో రగిలిపోతున్న ఇరాన్… అందుకు ప్రతీకారం తీర్చుకునే పని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అమెరికాకు మద్దతిస్తు్నన ఇరాక్‌పై అటాక్ చేసింది. ఇరాక్‌పై మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. బాగ్దాద్‌లోని ఎయిర్‌బేస్‌పై రాకెట్లతో దాడిచేసింది. ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం టార్గెట్‌గా దాడులు చేయడంతో అలర్టయిన అధికారులు… ఎంబసీలోని వారందరినీ హుటాహుటిని ఖాళీ చేయిస్తున్నారు.
శుక్రవారం బగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా దళాలు రాకెట్లతో దాడి చేశాయి. ఈ ఘటనలో సులేమానీ, ఇరాక్‌కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మరణించారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించగా.. పశ్చిమాసియాలో భారీ బలగాలను మోహరించింది అమెరికా. ఈ నేపథ్యంలో అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
Read More : తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం రెండు రోజులా ? 10 రోజులా ?