Kashmir Issue: భారత్‌తో శాశ్వత శాంతి కావాలంటున్న పాక్
ఈ విషయమై పాక్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం, భారత రాయబారిని బహిష్కరించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అత్యంత పతానవస్థకు క్షీణించాయి. అయితే ఉగ్రవాదానికి స్వస్తి చెబితే చర్చలకు సిద్ధమని భారత్ ఎప్పటి నుంచో చెప్తోంది. కానీ పాకిస్తాన్ అందుకు అంగీకరించకుండా ఐక్యరాజ్యసమితి ఒప్పందాలను సాకుగా చూపుతూ చర్చలు చేయాలని మొండికేసి కూర్చుంది.

we want perminet peace with india says pak pm
Kashmir Issue: కశ్మీర్ అంశానికి చర్చల ద్వారా పరిష్కారం చూపుకోవడంతో పాటు భారత్‌తో తాము శాశ్వత శాంతిని కోరుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. శనివారం హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి ప్రతినిధుల బృందంతో ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ అంశం పరిష్కారం కావాల్సి ఉందన్నారు. కశ్మీర్ అంశానికి యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాబోదని, సామరస్యపూర్వక చర్చలు మాత్రమే సమస్యలను సమస్యకు పరిష్కారాన్ని చూపుతాయని ఆయన అన్నారు.
బ్రిటిషర్లు స్వాతంత్ర్యం ఇచ్చినప్పటి నుంచి కశ్మీర్ అంశం ఇరు దేశాల మధ్య రావణ కాష్టలా రగులుతూనే ఉంది. అయితే కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, కశ్మీర్‌ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. పాక్ ఆక్రమిత్ కశ్మీర్ నుంచో, నేరుగా పాక్ నుంచో తరుచూ చొరబాటు యత్నాలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఆర్టికల్ 370 అనంతరం పరిస్థితులు మరింత దిగజారినట్లు ప్రభుత్వ డేటానే వెల్లడిస్తోంది.