వైట్ హౌస్ వీడిన ట్రంప్..బైడెన్ పేరు ప్రస్తావించకుండానే వీడ్కోలు ప్రసంగం

Donald Trump అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఇవాళ రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధానికి వీడ్కోలు పలికారు. ట్రంప్ కుటుంబం వైట్ హౌజ్‌ని వీడింది. మెరైన్ వన్‌లో వాషింగ్టన్ నుంచి సమీపంలోని సైనిక స్థావరానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ట్రంప్ వీడ్కోలు ప్రసంగం చేశారు. అమెరికా ప్రజలందరికీ ట్రంప్ ధన్యవాదాలు చెప్పారు.
స్టాఫ్ కి స్నేహితులకు,మద్దతుదారులకు, కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. తన పదవీకాలం అద్భుతంగా సాగిందన్నారు. మనమంతా కలిసికట్టుగా చాలా సాధించాం. మీ ప్రయత్నాలకు నా కృతజ్ఞతలు. ఈ కుటుంబం ఎంత కష్టపడి పనిచేసిందో ప్రజలకు తెలియదు అని అన్నారు. తాను ఎప్పుడూ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. తన హయాంలో ఉద్యోగాల కల్పనకు పెద్ద పీటవేశామన్నారు. చరిత్రలోనే తొలిసారిగా పన్నుల సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఉద్యోగాల కల్పనకు పెద్ద పీటవేశామన్నారు. కరోనా సమయంలోనూ సమర్థవంతంగా పనిచేశామన్నారు. తొమ్మిది నెలల్లోనే కరోనా వ్యాక్సిన్ ను తీసుకొచ్చామన్నారు. సంక్షోభ సమయంలోనూ ఆర్థిక వృద్ధి సాధించామన్నారు. అమెరికన్ల హక్కుల కోసం పోరాటం చేశామన్నారు.
త్వరలో కొత్త ఫోరంలో కులుద్దాం అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు. అయితే, తన ప్రసంగంలో కొత్త అధ్యక్షుడిగా మరికొద్ది గంటల్లో బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్ పేరుని ట్రంప్ ప్రస్తావించలేదు..కానీ కొత్త ప్రభుత్వానికి మంచి అదృష్టం,విజయం చేకూరాలని విష్ చేశారు. ప్రసంగం ముగిసిన అనంతరం ఫ్లో ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో కుటుంబంతో కలిసి ఫ్లోరిడాకు బయల్దేరారు ట్రంప్.
#WATCH Donald Trump departs from the White House as the president for the last time, ahead of the inauguration of president-elect Joe Biden in Washington#USA pic.twitter.com/xS8eirurtf
— ANI (@ANI) January 20, 2021