ట్రంప్‌కు ఆత్మీయ ఆలింగనంతో మోడీ WELCOME

ట్రంప్‌కు ఆత్మీయ ఆలింగనంతో మోడీ WELCOME

Updated On : February 24, 2020 / 6:35 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ప్రెసిడెంట్ కు స్పెషల్ స్టైల్ లో వెల్ కమ్ చెప్పారు. రోజు వాడే వాహనాన్ని పక్కకుపెట్టి రేంజ్ రోవర్ కారులో రన్ వై పైకి వచ్చారు. ముందుగానే ఇవాంక ట్రంప్‌ను కలిసి డొనాల్డ్ ట్రంప్.. మెలానియా ట్రంప్ కోసం ఎదురుచూశారు. ట్రంప్ కు హగ్ ఇచ్చి వెల్ కమ్ చెప్పి కరచాలనాలతో మిగిలిన వారికి స్వాగతం పలికారు. 

ట్రంప్ రాకతో గుజరాత్‌లో పండుగకు మించిన వాతావరణాన్ని సృష్టించారు. ఇక్కడి నుంచి నేరుగా స్టేడియంకు చేరుకోనున్నారు. అక్కడ నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొని తర్వాత ఆగ్రా వెళ్తారు. తాజ్ మహల్ పర్యటన తర్వాత ఢిల్లీకు చేరుకుని మౌర్య హోటల్ లో బస చేస్తారు. 

ట్రంప్ కోసం ప్రత్యేక వంటకాలు సిద్ధం చేశారు మోడీ. సమోసా.. ఛాయ్ ఏర్పాటు చేశారు. నాన్ వెజ్ ప్రియుడైన ట్రంప్ ను సంతృప్తి పరిచేందుకు పదుల సంఖ్యలో వంటకాలు ఎదురుచూస్తున్నాయి. 

ట్రంప్ పర్యటన భారత్ కు బలం చేకూరుస్తుందని.. ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగవడానికి దోహదపడుతుందని మోడీ ట్వీట్ ద్వారా వెల్లడించారు.