UN Security Council : యుఎన్ భద్రతా మండలి అంటే ఏంటి? యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఎలా అడ్డుకోగలదు?

యుక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యాను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. రష్యా దళాలపై యుక్రెయిస్ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది.

UN Security Council : యుఎన్ భద్రతా మండలి అంటే ఏంటి? యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఎలా అడ్డుకోగలదు?

What Is Un Security Council What The Un Can Do To Stop Russian Attack On Ukraine (2)

Updated On : February 26, 2022 / 5:02 PM IST

UN Security Council : యుక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యాను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. రష్యా దళాలపై యుక్రెయిస్ సైన్యం కూడా దీటుగానే ప్రతిఘటిస్తోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా వందల సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. శాంతిపరంగా చర్చలు జరిపేందుకు యుక్రెయిన్ సిద్ధమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు రష్యా యుద్ధాన్ని ఆపాలంటే ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలంటూ యుక్రెయిన్‌ను హెచ్చరించింది. కానీ, యుక్రెయిన్ మాత్రం ఒంటరిగానే పోరాటం చేస్తోంది. ప్రపంచ దేశాల మధ్య ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు శాంతిదూతగా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఇరుదేశాల మధ్య సయోధ్యను కుదర్చాలి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రపంచ దేశాల హెచ్చరికలను కూడా ధిక్కరించి పుతిన్ యుద్ధానికి కాలుదువ్వారు. మరోవైపు.. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానం కూడా వీగిపోయింది. U.N.S.C అత్యవసర సమావేశంలో రష్యా చర్యలపై మండలిలో ఓటింగ్ నిర్వహించింది. యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా ప్రతిపాదనపై 11 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. ఈ ఓటింగ్ ప్రక్రియలో భారత్, చైనాలు దూరంగా ఉన్నాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వమున్న రష్యా.. వీటో పవర్ సాయంతో తీర్మానాన్ని రద్దు చేయించుకుంది.

రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుక్రెయిన్‌పై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఇలా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం.. ఈ వారంలో రెండోది కాగా.. జనవరి 31 నుంచి నాల్గవది. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా, రష్యాపై ఆంక్షలు విధించడం, మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు దౌత్యపరమైన ఆంక్షలు విధించేందుకు కైవ్‌కు సాయం చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ డోనెట్స్క్ లుహాన్స్క్‌లోని రష్యన్ ఆక్రమణపై సాయన్ని అందించాలని విజ్ఞప్తి చేయడంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని అభ్యర్థించింది. ఈ క్రమంలోనే భద్రతా పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని యుక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ట్వీట్ చేశారు.

యుఎన్ భద్రతా మండలి అంటే ఏమిటి? :
ఐక్యరాజ్య సమితికి ప్రధాన సంక్షోభ-నిర్వహణ సంస్థనే భద్రతా మండలి.. ఈ భద్రతా మండలికి 193 యుఎన్ సభ్య దేశాలపై శాంతి పరిరక్షక కట్టుబాట్లను విధించే అధికారం ఉంది. ఈ భద్రతా మండలి 1946లో స్థాపించగా.. అప్పటినుంచి స్థిరంగానే ఉంది. ఇటీవలి ఏళ్లలో సిరియా అంతర్యుద్ధం ఇటీవలి – రష్యా-ఉక్రెయిన్ సమస్యలు వంటి అనేక సంఘర్షణలు, సంక్షోభాలకు తలెత్తిన సమయంలో ప్రతిస్పందించాల్సిన ఈ కౌన్సిల్ ప్రశ్నార్థకంగా మారింది. అంతర్జాతీయ వైరుధ్యాలను శాంతియుతంగా పరిష్కరించాలని యుఎన్ భద్రతా మండలి లక్ష్యంగా పెట్టుకుంది. చర్చ, మధ్యవర్తిత్వం లేదా శాంతియుత చర్యల ద్వారా సమస్యను పరిష్కరించాలి. అది విఫలమైతే.. అంతర్జాతీయ శాంతి భద్రత దృష్ట్యా ఆంక్షలు విధించడం లేదా బలప్రయోగాన్ని ఆమోదించడం వంటి చర్యలను చేపట్టే అధికారి ఈ భద్రతా మండలి కలిగి ఉంది. అయితే ఈ అధికారాన్ని UN చార్టర్ VII అధ్యాయం భద్రతా మండలికి ఇస్తుంది. 2014లో యుక్రెయిన్‌లో రష్యా జోక్యం చేసుకున్నప్పటి నుంచి రష్యా ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ సమయంలో ఇరుదేశాల మధ్య సంక్షోభాలను అడ్డుకోవడంలో ఈ భద్రతా మండలి విఫలమైందనే ఆందోళనకు దారితీసింది. ఎందుకంటే ఇలాంటి ఎన్నో తీర్మానాలను తిరస్కరించేందుకు రష్యా దాదాపు ఇరవై సార్లు తన వీటో అధికారాన్ని ఉపయోగించింది.

What Is Un Security Council What The Un Can Do To Stop Russian Attack On Ukraine

What Is Un Security Council What The Un Can Do To Stop Russian Attack On Ukraine

‘వీటో పవర్’ అంటే ఏంటి?
ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాను అడ్డుకునే పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లేదు. ఇప్పుడు ఈ భద్రతా మండలి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. UN చార్టర్ కింద రష్యాకు తన బాధ్యతలను గుర్తు చేయాలని ఐక్యరాజ్యసమితిలోని బ్రిటీష్ రాయబారి బార్బరా వుడ్‌వర్డ్ (Barbara Woodward) భద్రతా మండలిని కోరారు. రష్యా సైనిక చర్యలను నిలిపివేయాలని, సార్వభౌమ రాజ్యంపై దురాక్రమణను ఖండించాలని ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని ప్రధానంగా ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ కౌన్సిల్ నిర్ణయాలపై రష్యాకు వీటో అధికారం కలిగి ఉండటంతో అసాధ్యమనే చెప్పాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంది. యుక్రెయిన్‌లో కొత్త సంక్షోభాన్ని నిరోధించడానికి WWII తర్వాత వీటో పవర్ స్థాపించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతే ఈ భద్రతా మండలిని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ఐదు శాశ్వత సభ్యులు వీటో అధికారం కలిగి ఉంటారు.

ప్రతిపాదిత తీర్మానం లేదా నిర్ణయానికి శాశ్వత సభ్యులు ఎవరైనా వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ తీర్మానం ఆమోదయోగ్యం కాదు. శాశ్వత సభ్యుడు ప్రతిపాదిత తీర్మానంతో ఏకీభవించనప్పటికీ.. వీటోను వాడకుండా కూడా ఎంచుకోవచ్చు. ఈ తీర్మానానికి అవసరమైన 9 సానుకూల ఓట్లను పొందితే తీర్మానాన్ని ఆమోదించడానికి అనుమతి ఉంటుంది. 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత.. ఇలాంటి పరిస్థితే ఎదురైంది. భద్రతా మండలిలో వీటో అధికారం కలిగిన చైనా కూడా గైర్హాజరు అయింది. మరో 13 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. దాంతో రష్యా తన వీటో హక్కును వినియోగించుకుంది.

What Is Un Security Council What The Un Can Do To Stop Russian Attack On Ukraine (3)

What Is Un Security Council What The Un Can Do To Stop Russian Attack On Ukraine

UN భద్రతా మండలి సమావేశాలు
తూర్పు యుక్రెయిన్‌లోని వేర్పాటువాదులను మాస్కో అధికారంలోకి తీసుకొచ్చేందుకు పుతిన్ తీసుకున్న చర్యలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. యుక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను రష్యా ఉల్లంఘించడం పట్ల చాలా మంది సభ్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండించడానికి సమావేశమయ్యారు. పాశ్చాత్య ఇతర సభ్యుల ఒత్తిడితో బహిరంగ సమావేశానికి అంగీకరించినట్లు దౌత్యవేత్తలు తెలిపారు.

భద్రతా మండలి అధ్యక్షుడిగా రష్యా :
ఫిబ్రవరి నెలలో, రష్యా కౌన్సిల్ అధ్యక్ష పదవిని స్వీకరించింది. అంటే.. ఈ మండలిపై ప్రాథమికంగా అడ్మినిస్ట్రేటివ్ రోల్ రష్యాదే.. అందువల్ల రష్యా కార్యకలాపాలపై తదుపరి చర్చను అభ్యర్థించడానికి కౌన్సిల్ సభ్యులు చేసే ప్రయత్నాలను రష్యా నిరోధించవచ్చని కొంతమంది దౌత్యవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో పాశ్చాత్య దౌత్యం ఎక్కువగా UN సభ్యులలో మద్దతును సేకరించడానికి, రష్యా UN చార్టర్‌ను ఉల్లంఘించిందని ఆరోపించడంపైనే దృష్టి సారించింది. దౌత్య వర్గాల సమాచారం ప్రకారం.. యుక్రెయిన్‌లో రష్యా ఇటీవలి చర్యలను ఖండించే లక్ష్యంతో అమెరికా, అల్బేనియా UN భద్రతా మండలికి ముసాయిదా తీర్మానాన్ని సమర్పించనున్నాయి. ఈ తీర్మానం ఐక్యరాజ్యసమితిలో ఆమోదం పొందాల్సి ఉంది. ఇప్పటికే రష్యా చర్యలను మెజారిటీ దేశాలు విమర్శించాయి. యుక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాలను స్వతంత్రంగా గుర్తించాలన్న రష్యా నిర్ణయాన్ని భద్రతా మండలి సైతం బహిరంగంగా ఖండించింది. ఈ తీర్మానం మొదట 15 మంది సభ్యుల UN భద్రతా మండలికి సమర్పించనున్నారు. రష్యా వీటో అధికారం కారణంగా ఈ తీర్మానం దాదాపుగా విఫలమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Read Also : Russia-Ukraine War: ఇంట్లోనే పెట్రోల్ బాంబులు తయారు చేసి రష్యా సైనికులపై విరుచుకుపడుతున్న యుక్రెయిన్ ప్రజలు