sunita williams: సునీతా విలియమ్స్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ఏం చేస్తుందో తెలుసా?

సాధారణంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష నౌక నుంచి ఐఎస్ఎస్ కి పంపబడతారు. అయితే, ఈసారి క్రూ-9 మిషన్ ద్వారా కేవలం ఇద్దరు వ్యోమగాములను మాత్రమే

sunita williams: సునీతా విలియమ్స్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ఏం చేస్తుందో తెలుసా?

sunita williams

Updated On : September 17, 2024 / 8:23 AM IST

Sunita Williams : అంతరిక్షంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ లను భూమిపైకి తిరిగి తీసుకురావడానికి నాసా ప్రయత్నాలు ప్రారంభించింది. ఫిబ్రవరి 2025లో స్పేస్-ఎక్స్ కు చెందిన క్రూ-9 మిషన్ నుండి వారిని తిరిగి తీసుకువస్తామని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాసాకు చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు దీనికి సంబంధించి సన్నాహాలు ప్రారంభించారు. వాస్తవానికి నాసా యొక్క నిక్ హేగ్, రోస్కోస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ క్రూ-9 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కి వెళ్లే ముందు నిర్బందంలో ఉంటారు.

Also Read : Sunita Williams : ‘మేం పనిచేయకుంటే.. ఎముకల సాంద్రతను కోల్పోతాం..’ అంతరిక్షంలో సవాళ్లపై సునీతా విలియమ్స్ ఇంకా ఏమన్నారంటే?

నాసా విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా.. సెప్టెంబర్ 26న స్పేస్-ఎక్స్ సహాయంతో క్రూ-9 మిషన్ ను ప్రయోగించనున్నట్లు తెలిసింది. నాసా నిక్ హేగ్, కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవోలను ప్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి స్పేస్ -ఎక్స్ యొక్క ఫాల్కన్-9 రాకెట్ సహాయంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతుంది. భారత కాలమానం ప్రకారం.. క్రూ-9 మిషన్ సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి 11.58గంటలకు ప్రారంభవుతుందని నాసా తెలిపింది. ప్రయోగించిన ఆరు గంటల తరువాత ఇద్దరు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నారు.

Also Read : Sunita Williams : అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ రాకపై కీలక ప్రకటన చేయనున్న నాసా!

సాధారణంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష నౌక నుంచి ఐఎస్ఎస్ కి పంపబడతారు. అయితే, ఈసారి క్రూ-9 మిషన్ ద్వారా కేవలం ఇద్దరు వ్యోమగాములను మాత్రమే ఐఎస్ఎస్ కు పంపించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో క్రూ-9 మిషన్ తిరిగి భూమికి తిరిగి రానుంది. అందులో ఇద్దరు వ్యోమగాముల ద్వారా.. సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ కూడా భూమికి తిరిగి రానున్నారు.