Vanuatu : వనువాటు.. ఈ దేశం ఎక్కడుంది? దీని విశేషాలు ఏంటి?

అందమైన దేశం. కచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఎలాంటి కాలుష్యం ఉండదు, శబ్దాలు ఉండవు.

Vanuatu : వనువాటు.. ఈ దేశం ఎక్కడుంది? దీని విశేషాలు ఏంటి?

Updated On : March 10, 2025 / 9:30 PM IST

Vanuatu : వ్యాపారవేత్త, ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా.. వనువాటు.. అవును.. అక్కడి నుంచి ఆయన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను వానువటులో ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్ లో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి తప్పించుకోవడానికి వనువాటు వెళ్లారు లలిత్ మోడీ. అక్కడి పాస్ పోర్టును కూడా ఆయన సాధించారు. అయితే, లలిత్ మోడీకి జారీ చేసిన వనువాటు పాస్ పోర్టును రద్దు చేయాలని పౌరసత్వ కమిషన్ ను ఆ దేశ ప్రధాని ఆదేశించారు.

పాస్ పోర్ట్ రద్దు వివాదం సంగతి పక్కన పెడితే.. ఐలాండ్ దేశానికి చేరుకున్న లలిత్ మోడీ.. ఆ దేశాన్ని సందర్శించాలని ప్రజలను కోరారు. ”వనువాటు చాలా అందమైన దేశం. కచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఎలాంటి కాలుష్యం ఉండదు, శబ్దాలు ఉండవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది భూతల స్వర్గం” అని లలిత్ మోడీ అన్నారు. లండన్‌లోని భారత హైకమిషన్‌లో తన భారత పాస్‌పోర్ట్‌ను అప్పగించిన తర్వాత, మోడీ వనువాటు పౌరసత్వాన్ని పొందారని సమాచారం.

Also Read : కెనడా నూతన ప్రధానిగా మార్క్‌ కార్నీ.. ఆయన ఎవరు..? ట్రంప్ హెచ్చరికలపై ఏమన్నారో తెలుసా..

అయితే, మోడీ కొత్తగా పొందిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనువాటు ప్రధాని మంత్రి జోథమ్ నపట్ పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించడంతో ఆయన కొత్త ఇబ్బందుల్లో పడ్డారు. ”లలిత్ మోడీ వనువాటు పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడానికి వెంటనే చర్యలు ప్రారంభించాలని నేను పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించాను” అని వనువాటు ప్రధాని అధికారిక ప్రకటనలో తెలిపారు.

మాజీ ఐపీఎల్ బాస్ లలిత్ మోడీ వనువాటు వెళ్లడానికి ముందు లండన్ లో నివసించినట్లు సమాచారం. మోడీని ఆర్థిక నేరస్థుడిగా అభివర్ణించిన భారత దర్యాప్తు సంస్థలు.. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

పాస్ట్ పోర్ట్ గొడవ గురించి పక్కడ పెడితే.. సోషల్ మీడియాలో లలిత్ మోడీ పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి. వనువాటు గురించి డిస్కషన్ జరుగుతోంది. అసలు ఈ దేశం ఎక్కడుంది? దాని విశేషాలు ఏంటి? అని నెటిజన్లు సెర్చ్ చేస్తన్నారు.

Also Read : కోడి గుడ్లు స్మగ్లింగ్.. డ్రగ్స్‌ను మించి కొనసాగుతున్న దందా.. కోడి పెట్టలను అద్దెకిస్తూ జోరుగా వ్యాపారం

వనువాటు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక దేశం. 1,300 కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 80 ద్వీపాలతో రూపొందించబడింది. ఈ ద్వీపాలు పగడపు దిబ్బలు, నీటి అడుగున గుహలు, రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి సైనిక దళం SS అధ్యక్షుడు కూలిడ్జ్ వంటి శిధిలాల వద్ద స్కూబా డైవింగ్‌ను అందిస్తాయి.

దేశ రాజధాని, ఆర్థిక కేంద్రమైన హార్బర్‌సైడ్ పోర్ట్ విలా ఎఫేట్ ద్వీపంలో ఉంది. ఈ నగరం వనువాటు నేషనల్ మ్యూజియంకు నిలయంగా ఉంది. ఇది దేశం మెలనేసియన్ సంస్కృతికి అద్దం పడుతుంది. వనువాటు రాజధాని పోర్ట్ విల్లా. అక్కడి అధికారిక భాషలు బిస్లామా, ఫ్రెంచ్, ఇంగ్లీష్. ఓసినియా ఖండంలో ఉంది. ఈ దేశ జనాభా 3.2 లక్షలు.