ఎవరీ వైభవ్..? ఎలాన్ మస్క్ పెట్టిన అమెరికా పార్టీలో భారత సంతతి వ్యక్తి కీ రోల్.. ‘డబ్బంతా’ ఆయన దగ్గరే..
వైభవ్ తనేజా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ నుంచి చార్టర్డ్ అకౌంటెన్సీ చదివారు.

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ (AMEP)ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా కీలక పాత్ర పోషిస్తున్నారు. టెస్లా ఫైనాన్స్ హెడ్‌గా ఉన్న వైభవ్ ఇప్పుడు అమెరికా పార్టీకి కస్టోడియన్ ఆఫ్ రికార్డ్స్, ట్రెజరర్‌గా నామినేట్ అయ్యారు. ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ (FEC)కు సమర్పించిన పత్రాల ఆధారంగా ఈ వివరాలు తెలిశాయి. వైభవ్ తనేజా టెస్లాలో ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నారు.
టెస్లాలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా 2023 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు (ఆస్టిన్, టెక్సాస్‌లో) పనిచేస్తున్నారు. అంతకుముందు, చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ (CAO)గా 2019 మార్చి నుంచి, కార్పొరేట్ కంట్రోలర్‌గా 2018 మే నుంచి 2019 మార్చి వరకు, అసిస్టెంట్ కార్పొరేట్ కంట్రోలర్‌గా 2017 ఫిబ్రవరి నుంచి 2018 మే వరకు పనిచేశారు.
టెస్లాలో చేరే ముందు తనేజా సోలార్‌సిటీ సంస్థలో ఒక సంవత్సరం పని చేశారు. దానికి ముందు, ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్‌లో 17 సంవత్సరాలు పనిచేశారు.
వైభవ్ తనేజా సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (CPA), చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. యూఎస్ జీఏఏపీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఎస్‌ఈసీ కంప్లయిన్స్, రెగ్యులేటరీ ఫైలింగ్స్, ఇంటర్నల్ కంట్రోల్స్, ఆడిట్ మానిటరింగ్, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, బోర్డ్ సభ్యులతో నేరుగా పని చేయడంలో అనుభవం ఉంది.
Also Read: గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయోచ్.. 10 గ్రాముల ధర..
వైభవ్ తనేజా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ నుంచి చార్టర్డ్ అకౌంటెన్సీ చదివారు.
టెస్లా, స్పేస్‌ఎక్స్ అభివృద్ధిలో తనేజా… ఎలాన్ మస్క్‌తో కలిసి పనిచేశారు. ఆర్థిక ప్రకటనలు, ఆడిట్లు, కంప్లయిన్స్ డాక్యుమెంట్ల బాధ్యతలు చేపట్టారు.
అమెరికా పార్టీ ట్రెజరర్‌గా తనేజాను నియమించడంతో మస్క్ ప్రణాళికళ గురించి విశ్లేషకులు ఓ అంచనాకు వస్తున్నారు. మస్క్ తన రాజకీయ రంగ ప్రవేశానికి తన నమ్మకస్తులను ఉపయోగించనున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో విభేదాలు రావడంతో మస్క్ తన కొత్త పార్టీని ప్రకటించారు. వృథా ఖర్చు, అవినీతితో అమెరికాను దివాళా తీయించడానికి డెమొక్రట్లు-రిపబ్లికన్లు కలిసి పనిచేస్తున్నారని, దీనికో ప్రత్యామ్నాయ పార్టీ అవసరమని మస్క్ ఆ సందర్భంగా చెప్పారు.