చైనీస్ వైరస్ అనొద్దు.. ట్రంప్‌కు WHO వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ గురించి తాజాగా ఓ ట్విట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. COVID-19ను చైనీస్ వైరస్ అని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మండిపడింది. ఇంకోసారి అలా అనొద్దని వార్నింగ్ ఇచ్చింది.
వైరస్‌లకు జాతి, కులాలు తెలియవు. అదేం చైనీస్ వైరస్ కాదు.. మీకు నచ్చినట్టు పిలస్తే బాగోదు. ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ప్రతి ట్వీట్‌లో అది చైనీస్ వైరస్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ తీసుకున్నది. కరోనా వైరస్ అని మాత్రం అనండి.. ఎలా పడితే అలా పేర్లు పెట్టడం కరక్ట్ కాదని చెప్పారు.
2009, నార్త్ అమెరికాలో హెచ్1ఎన్1 వైరస్ ప్రారంభమైందని, మరి అప్పుడెందుకు దాన్ని ఆ ప్రాంతం పేరుతో ‘అమెరికన్ ఫ్లూ’ అని పిలువలేదని ర్యాన్ అన్నారు. ఇప్పటికైనా ఓ ప్రాంతంతో వైరస్‌ను పోల్చడం ఆపేయాలన్నారు. వైరస్‌పై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాటం చేయాలని ర్యాన్ పిలుపునిచ్చారు.
ఇక ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 2 లక్షలు దాటినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియాసెస్ తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఆ రోగిని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
Also Read | తెలంగాణలో 144 సెక్షన్, హోటల్స్ మూసివేత, ఆర్టీసీ బస్సులు బంద్..కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు?