ఇస్లాంకు వ్యతిరేకమంటూ ప్రధాని నాటిన మొక్కలు పీకేస్తున్నారు

ఇస్లాంకు వ్యతిరేకమంటూ ప్రధాని నాటిన మొక్కలు పీకేస్తున్నారు

Updated On : September 10, 2020 / 1:11 PM IST

పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదివారం దేశంలోనే అతిపెద్ద ట్రీ ప్లాంటేషన్ ప్రచారం మొదలుపెట్టారు. అయితే నేలలో నాటిన మొక్కలను కొందరు యువకులు పీకేస్తున్న వీడియో వైరల్ అయింది. ఎందుకంటే ఇది ఇస్లామిజానికి విరుద్ధం అని వారి ఉద్దేశ్యమట. ఈ వైరల్ వీడియోను ట్విట్టర్ లో టెక్స్టుతో పాటు ఇలా పోస్టు చేశారు.



‘పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ వారంతంలో ట్రీ ప్లాంటింగ్ నిర్వహించారు. ఈ శ్రమను తీవ్రవాదులు ఇస్లాంకు వ్యతిరేకం అని ఆరోపిస్తున్నారు. వింతగా అనిపిస్తుంది. అన్ని మతాలు భూమిని కాపాడుకోవాలనే చెప్తున్నాయి’ అని పోస్టు చేశారు.

ఈ వీడియోకు 70వేల వ్యూస్ దక్కాయి. పాకిస్తాన్ ఖైబర్ మండీ కాస్ జిల్లాలో వేర్లతో సహా పీకేయడం కనిపిస్తుంది. కానీ, కంటికి కనిపించనిది మరొకటి ఉంది. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నపని. ఈ స్థల వివాదం జరుగుతుండగా వ్యతిరేక ఆందోళనలో భాగంగానే ఇలా జరిగిందని చెప్తుంది అక్కడి లోకల్ టీవీ.



అడ్మినిస్ట్రేషన్ నాటిన 6వేల మొక్కలను తొలగించేశారు. ఖైబర్ పక్తున్‌ఖ్వా సీఎం మహమూద్ ఖాన్.. ఘటన గురించి తెలియగానే ఆందోళనకారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 3.5మిలియన్ మొక్కలు నాటగలిగారు. వాతావరణ పరిస్థితుల కారణంగా నష్టపోయిన టాప్ 10దేశాల్లో పాకిస్తాన్ ఒకటి.