Sunita Williams: అసలు సునీత విలియమ్స్‌ అంతరిక్ష కేంద్రానికి ఎందుకు వెళ్లారు?

అంతరిక్షంలోకి సామాన్యులను తీసుకెళ్లడానికి నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ (CCP)కు ప్రణాళిక వేసుకుంది.

Sunita Williams: అసలు సునీత విలియమ్స్‌ అంతరిక్ష కేంద్రానికి ఎందుకు వెళ్లారు?

Astronaut Sunita Williams

Updated On : March 19, 2025 / 6:03 AM IST

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌ దాదాపు తొమ్మిది నెలల పాటు ఉన్నారు. అసలు వారు ఐఎస్‌ఎస్‌కు ఎందుకు వెళ్లారో తెలుసా?

సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌ గత ఏడాది జూన్ 5న టెస్ట్ మిషన్ కోసం ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. బోయింగ్‌ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో వారు ఎనిమిది రోజుల మిషన్‌పై అక్కడకు వెళ్లారు. ఇంతకీ ఆ టెస్ట్ మిషన్ ఏంటో తెలుసా? ఇది నాసా బోయింగ్ స్టార్‌లైనర్ క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్. దీని లక్ష్యం బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను పరీక్షించడం.

అంతరిక్షంలోకి సామాన్యులను తీసుకెళ్లడానికి నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ (CCP)కు ప్రణాళిక వేసుకుంది. దీని కోసం బోయింగ్ CST-100 స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకను అభివృద్ధి చేశారు. ఐఎస్‌ఎస్‌కి సాధారణ మానవుడిని తీసుకెళ్లేందుకు నాసా నుంచి ఆమోద ముద్ర పడాలంటే ముందుగా స్టార్‌లైనర్ పనితీరును పరీక్షించాలి.

Also Read: సునీత విలియమ్స్‌కి భారీగా జీతం.. నాసాలో ఉద్యోగులకు ఎంత వేతనం ఉంటుందో తెలుసా?

దీంతో ఈ పరీక్షల కోసమే బోయింగ్‌ సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌ను ఎంచుకుంది. వారిద్దరు బోయింగ్‌ స్టార్‌లైనర్‌ను పరీక్షించి ఎనిమిది రోజుల్లో తిరిగా రావాల్సింది. సునీత విలియమ్స్ ఈ మిషన్‌కు పైలట్. కమాండర్ బుచ్ విల్మోర్‌తో కలిసి సునీత విలియమ్స్‌ స్టార్‌లైనర్ వ్యవస్థలు, డాకింగ్ సామర్థ్యాలు, భద్రతను అంచనా వేయడానికి ఐఎస్‌ఎస్‌కు అందులో వెళ్లారు.

ఐఎస్‌ఎస్‌తో స్టార్‌లైనర్‌ విజయవంతంగా అనుసంధానమైనప్పటికీ అనంతరం దాదాపు ఐదు థ్రస్టర్లు పని చేయట్లేదని గుర్తించారు. అంతేగాక, ప్రొపల్షన్‌ సిస్టమ్‌లో హీలియం లీకేజీ వంటి టెక్నికల్‌ సమస్యలు తలెత్తాయి. నాసా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి బోయింగ్, స్పేస్‌ఎక్స్ (ప్రైవేట్ కంపెనీలు)తో కలిసి పనిచేస్తోంది.

మిషన్ గురించి సంక్షిప్తంగా

  • ప్రయోగ తేదీ: 2024 జూన్ 5
  • అంతరిక్ష నౌక: బోయింగ్ సీఎస్‌టీ-100 స్టార్‌లైనర్
  • ప్రయోగ స్థలం: కేప్ కెనావెరల్, ఫ్లోరిడా
  • వ్యవధి: ఐఎస్‌ఎస్‌లో ఎనిమిది రోజులు
  • లక్ష్యం: స్టార్‌లైనర్‌కు సర్టిఫికేషన్ ఇచ్చే ముందు తుది పరీక్ష