William Shakespeare : ప్రపంచంలోనే తొలి కొవిడ్ టీకా అందుకున్న విలియం షేక్స్‌పియర్‌ కన్నుమూత

ప్రపంచంలోనే కొవిడ్ టీకా అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బ్రిటన్‌కు చెందిన విలియం షేక్స్ పియర్ (81) ఇంగ్లాండ్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు.

William Shakespeare : ప్రపంచంలోనే తొలి కొవిడ్ టీకా అందుకున్న విలియం షేక్స్‌పియర్‌ కన్నుమూత

William Shakespeare Dies Aged 81 In England Who First Man In World To Receive Covid 19 Jab

Updated On : May 26, 2021 / 6:45 PM IST

William Shakespeare : ప్రపంచంలోనే కొవిడ్ టీకా అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బ్రిటన్‌కు చెందిన విలియం షేక్స్ పియర్ (81) ఇంగ్లాండ్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ మేరకు బ్రిటన్ మీడియా ఒక ప్రకటనలో వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సిన్ తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో ఆయన మరణించారు.

విలియం షేక్స్ పియర్ గత ఏడాది డిసెంబర్ 8న యూనివర్శిటీ హాస్పిటల్ కోవెంట్రీలో ఫైజర్ టీకా అందుకున్నారు. విలియం కంటే ముందు 91ఏళ్ల మహిళ మార్గరేట్ కీసన్ కరోనా టీకా అందుకుని రికార్డు సృష్టించారు. పురుషుల్లో తొలి కొవిడ్ టీకా అందుకున్న ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా షేక్స్ పియర్ నిలిచారు.

ఫైజర్-బయోఎంటెక్ కోవిడ్ -19 టీకా పొందిన ప్రపంచంలో రెండవ వ్యక్తిగా విలియం షేక్స్ పియర్ సంబంధం లేని అనారోగ్యం కారణంగా మరణించారు. కోవెంట్రీ స్ట్రాట్‌ఫోర్డ్-అపాన్-అవాన్ నుంచి 20 మైళ్ల దూరంలో ఉంది. ఇంగ్లాండ్ కవి, మాజీ రోల్స్ రాయిస్ ఉద్యోగి, పారిష్ కౌన్సిలర్ అయిన షేక్స్ పియర్ దీర్ఘకాలిక అనారోగ్యంతో యూనివర్శిటీ హాస్పిటల్ కోవెంట్రీలో మరణించారు.

విలియం షేక్స్ పియర్‌కు భార్య జాయ్, ఇద్దరు పెద్ద కుమారులు, మనవరాళ్లు ఉన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. లక్షల్లో కరోనా కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 16,85,13,226 చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 34,99,417కి చేరింది.