Wimbledon Officials Warning : ఈ గదిని శృంగారం కోసం వాడొద్దు…వింబుల్డన్ ఆటగాళ్లకు అధికారుల హెచ్చరిక

వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ 2023 పోటీల సందర్భంగా ఆటగాళ్లు, ప్రేక్షకులకు టోర్నమెంట్ నిర్వహణ అధికారులు సంచలన హెచ్చరిక జారీ చేశారు.క్రీడాకారులు ప్రార్థనలు చేసేందుకు కేటాయించిన గదిలో శృంగారం జరపడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు....

Wimbledon Officials Warning : ఈ గదిని శృంగారం కోసం వాడొద్దు…వింబుల్డన్ ఆటగాళ్లకు అధికారుల హెచ్చరిక

Wimbledon Officials Warning

Wimbledon Officials Warning : వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ 2023 పోటీల సందర్భంగా ఆటగాళ్లు, ప్రేక్షకులకు టోర్నమెంట్ నిర్వహణ అధికారులు సంచలన హెచ్చరిక జారీ చేశారు. (Warning To Players And Spectators) వింబుల్డన్ 2023 ఈవెంట్ సందర్భంగా ప్రార్థనల కోసం కేటాయించిన గదిలో కొన్ని జంటలు శృంగారం చేస్తున్నారని వింబుల్డన్ నిర్వహణ అధికారుల దృష్టికి వచ్చింది. టెన్నిస్ కోర్టు 12 సమీపంలో ప్రార్థనల కోసం కేటాయించిన ఏకాంత గదిని కొన్ని జంటలు శృంగారం కోసం వినియోగించినట్లు తేలడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు.

Taliban Ban : అప్ఘానిస్థాన్‌లో మహిళా బ్యూటీ సెలూన్లపై తాలిబన్ల నిషేధాస్త్రం

క్రీడాకారులు ప్రార్థనలు చేసేందుకు కేటాయించిన గదిలో శృంగారం జరపడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ప్రార్థనల కోసం కేటాయించిన గదిని సరైన మార్గంలో ఉపయోగించాలని వింబుల్డన్ నిర్వహణ అధికారులు కోరారు. (Wimbledon Officials Warning) గత ఏడాది జరిగిన టెన్నిస్ పోటీల సందర్భంగా కొన్ని జంటలు గదిలో నుంచి నవ్వుతూ రావడాన్ని తాను చూశానని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలీ బోల్టన్ చెప్పారు.

Unmarried : హర్యానాలో పెళ్లి కాని వారికి శుభవార్త…త్వరలో పెన్షన్ పథకం

టోర్నమెంట్ రద్దీ సందర్భంగా ఆటగాళ్లు ప్రార్థనలు చేసుకునేందుకు, చంటిబిడ్డలకు తల్లి పాలు ఇచ్చేందుకు వీలుగా తాము ఏకాంతంగా ఉండేలా గదులు ఏర్పాటు చేశామని, కాని ఆ గదుల్లో నుంచి జంటలు శృంగారం చేస్తున్న శబ్ధాలు వస్తున్నాయని కొందరు సందర్శకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ గదుల్లో జంటలు శృంగారం చేయొద్దని టోర్నమెంట్ నిర్వహణ అధికారులు క్రీడాకారులు, సందర్శకులను హెచ్చరించారు. దీంతోపాటు వింబుల్డన్ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన అందమైన పార్కుల్లో శృంగారం చేయడం, డ్రగ్స్ తీసుకోవడం చేయవద్దని పోలీసులు సైతం హెచ్చరించారు.