ఆ రోజు ఉపవాసం : సింహాన్ని రెచ్చగొట్టిన యువతి.. దగ్గరగా వెళ్లి డ్యాన్స్!

జంతువులను చూడటం అంటే అందరికి ఇష్టమే. పిల్లలు అయితే ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. జూకు వెళ్లిన సమయంలో కనిపించే ప్రతి జంతువును చూసి ముచ్చటపడుతుంటారు. ఫొటోలు తీస్తారు.. దూరంగా నిలబడి సెల్ఫీలు తీసుకుంటారు. కొంతమంది సందర్శకులు జూకు వెళ్లినప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ప్రమాదమని తెలిసి కూడా క్రూర జంతువులతో చనువు పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. పెంపుడు జంతువుల మాదిరిగా మచ్చిక చేసుకోవాలని చూస్తుంటారు. అందులోనూ సింహాం లాంటి ప్రమాదకరమైన జంతువుతో ఆటలాడితే చీల్చి చెండాడేస్తుంది.
న్యూయార్క్ లోని బ్రాంక్స్ జూలో ఓ యువతి రచ్చ రచ్చ చేసింది. జూలో ఉండే గేటు దూకి సింహం ఉండే ప్రాంతంలోకి వెళ్లింది. సింహం ముందు నిలబడి ఆ అనుభవాన్ని చవిచూడాలనుకుంది. దాని దగ్గరగా వెళ్లి డ్యాన్స్ చేసింది. యువతి చేష్టలను చూసి సింబాకు చిరెత్రుకొచ్చింది. యువతిపై దాడి చేసేందుకు ప్రయత్నించి ఆగిపోయింది.
బహుషా.. ఆరోజు సింహం.. ఉపవాస దీక్షలో ఉందేమో.. నాన్ వేజ్ ముట్టదేమో.. అందుకే దాడి చేయకుండా వదిలేసింది. లేచిన వేళ బాగుంది.. లేదంటే సింహం చేతిలో యువతి ప్రాణాలు పోయేవి. ఈ షాకింగ్ వీడియోను అక్కడి మరో సందర్శకులు రికార్డు చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో పోస్టు చేసిన మూడు రోజుల్లోనే 24వేల వ్యూస్ వచ్చాయి. వైరల్ అవుతున్న వీడియో ఇదే..