Marinelli bend : ప్రమాదకరమైన విన్యాసం…

Marinelli Bend
Woman performs : ఓ మహిళ చేసిన ప్రమాదకరమైన విన్యాసం సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం చిన్నపాటి పైపును నోట్లో పెట్టుకుని..దానిపై యోగా లాంటిది చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆ మహిళ షేర్ చేసింది.
రష్యా దేశానికి చెందిన anastasia మహిళ..భర్తతో కలిసి కెనడాలో నివాసం ఉంటోంది. యోగా లాంటి అద్బుతమైన విన్యాసాలు చేయడంలో ఈమె దిట్ట. కానీ..ఎవరూ చేయని విధంగా విన్యాసం చేయాలని (Marinelli bend) భావించారు ఆమె. అనుకున్నట్లుగా కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేసింది. చిన్న పైపును నోటితో పట్టుకుంది. రెండు చేతులు..కాళ్లను భూమిపై ఆనించింది. తర్వాత మెలిగా..కాళ్లను మెల్లిగా పైకి లేపి..స్ట్రైట్ గా పెట్టింది.
తర్వాత..రెండు చేతులను మెల్లిగా పైకి లేపేందుకు ప్రయత్నించింది. తర్వాత రెండు చేతులను కాళ్లు చేసినట్లుగానే స్ట్రైట్ గా పెట్టింది. అలా కొద్ది నిమిషాల పాటు అలానే నిలిచింది. తర్వాత..మెల్లిగా..కాళ్లను చేతులను కిందకు దింపింది. దీనిని ఇన్ స్ట్రా గ్రామ్ ద్వారా..షేర్ చేసింది. చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. చాలా ప్రమాదకరమైన విన్యాసం అని, గ్రేట్ అంటూ కామెంట్స్ చేశారు. ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు తాను ప్రాక్టీస్ చేస్తానని anastasia చెప్పారు.
View this post on Instagram