Oxygen Plants to India: ఇండియాకు 3 ఆక్సిజన్ ప్లాంట్లు మోసుకురానున్న అతి పెద్ద కార్గో విమానం
యూకే 18 టన్నుల ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లను ఇండియాకు పంపనుంది. ఒక్కొక్కటి నిమిషానికి 500లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగలదు.

Worlds Largest Cargo Plane Carries Three Oxygen Plants To India From Uk
Oxygen Plants to India: యూకే 18 టన్నుల ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లను ఇండియాకు పంపనుంది. ఒక్కొక్కటి నిమిషానికి 500లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగలదు. వీటిని ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం సహాయంతో ఇండియాకు తరలించనున్నారు. సెకండ్ వేవ్ ధాటికి కరోనావైరస్ ఇన్ఫెక్షన్ తొ ఆక్సిజన్ కొరత ఏర్పడి చాలా మంది ఇండియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఆ విమానంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు మాత్రమే కాకుండా 1000వెంటిలేటర్లు కూడా ఇండియాకు రానున్నాయి. యూకే విదేశాంగ, కామన్వెల్త్ అండ్ డెవలప్ మెంట్ సమకూర్చిన నిధులతో వీటిని ఇక్కడకు తీసుకురానున్నారు.
ఆ ప్లాంట్ల ఒక్కొక్క దాని పొడవు.. 40 అడుగుల వరకూ ఉంటుంది. నిమిషానికి ఉత్పత్తి చేసే 500 లీటర్ల ఆక్సిజన్.. ఒకే సారి 50మందికి సరిపోతుంది. ఆదివారం ఉదయం నాటికి ఇండియాకు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాటిని హాస్పిటల్స్ కు చేరవేస్తుంది.
లేటెస్ట్ సపోర్ట్ ప్యాకేజి కింద 200 వెంటిలేటర్లు, 495 ఆక్సిజన్ కాన్సంట్రటేర్లను యూకే గత నెలలోనే ఇండియాకు పంపించింది. ఇండియాతో చర్చలు జరిపిన ప్రధాని బోరిస్ జాన్సన్… అవసరమైనంత సహాయం చేస్తామని మాటిచ్చారు.
యూకే విదేశాంగ సెక్రటరీ డామినిక్ రాబ్ మాట్లాడుతూ.. నార్తరన్ ఐర్లాండ్ నుంచి ఇండియాకు ఈ ఆక్సిజన్ జనరేటర్లను పంపిస్తుంది యేకే. ఈ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ దేశంలోని అన్ని హాస్పిటల్స్ కు అందితే కొవిడ్-19 పేషెంట్లకు సహాయం చేసినట్లు అవుతుంది. యూకే, ఇండియా కలిసి మహమ్మారితో పోరాడుతున్నాయి. మనం సేఫ్ గా లేనంత వరకూ ఎవరూ సేఫ్ కాలేరని అన్నారు.
శుక్రవారమే జపాన్ ఎంబస్సీ 100 ఆక్సిజన్ కాన్సట్రేటర్లను ఇండియాకు పంపుతామని చెప్పింది. మొత్తం 300ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, 300వెంటిలేటర్లను ఇండియాకు పంపుతామని ఏప్రిల్ 30నే ప్రకటించి జపాన్ గవర్నమెంట్.