Elon Musk: అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. మరో ఫీట్‌కి సిద్ధం..! అదే జరిగితే ఏకంగా లక్ష కోట్ల డాలర్లు..!
స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ బిజినెస్ విస్తరణ కోసం ఈ నిధుల సేకరణ అవసరం అని కంపెనీ చెప్తుండగా..నిధుల సేకరణతో వచ్చే ఆదాయాన్ని మూన్, మార్స్ మిషన్లకు వినియోగించనుంది.
Elon Musk: అపర కుబేరుడు..అనితరసాధ్యమైన కార్యాలను సాధించే ఎలాన్ మస్క్ మరో ఫీట్‌కి సిద్ధమయ్యాడు. తన ఫ్లాగ్‌షిప్ కంపెనీల్లో ఒకటైన స్పేస్ఎక్స్ సంస్థని స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. అసలు ఇప్పటిదాకా ఏ సంస్థకీ దక్కనంత వేల్యేషన్ ఓపెనింగ్ రోజునే స్పేస్ఎక్స్‌కి వచ్చేలా ప్లాన్ చేశాడంటున్నారు. అదే జరిగితే..ఏకంగా లక్షకోట్ల డాలర్ల వేల్యేషన్ సాధించిన సంస్థగా స్పేస్ఎక్స్ హిస్టరీ రికార్డ్ చేయడం ఖాయంగా కన్పిస్తోంది.
అమెరికన్ దిగ్గజ కంపెనీ స్పేస్ఎక్స్‌ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చేందుకు టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్లానేశాడు. వచ్చే ఏడాదిలో ఈ ఐపిఓ రానుండగా..కనీసం లక్ష కోట్ల డాలర్లను ఇన్వెస్టర్ల నుంచి సేకరించనున్నట్లు తెలుస్తోంది. 2002లో స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ టెక్నాలజీ కార్ప్ ప్రారంభం కాగా.. టెక్సస్ బ్రౌన్స్ విల్లేలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. అమెరికాలోని ప్రైవేట్ స్పేస్ కంపెనీల్లో నంబర్ వన్ కంపెనీగా..లో ఎర్త్ అర్బిట్‌లో స్పేస్‌షిప్స్ పంపిన సంస్థగా గుర్తింపు ఉంది. అలానే అనేక అంతరిక్ష ప్రయోగాలకు స్పేస్ ఎక్స్ కేరాఫ్ అడ్రస్‌గా ఉండగా..లిస్టింగ్‌తో కంపెనీ లార్జెస్ట్ గ్లోబల్ ఐపిఓగా అవతరించనుంది.
స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ బిజినెస్ విస్తరణ కోసం ఈ నిధుల సేకరణ అవసరం అని కంపెనీ చెప్తుండగా..నిధుల సేకరణతో వచ్చే ఆదాయాన్ని మూన్, మార్స్ మిషన్లకు వినియోగించనుంది. 2026 జూన్ కానీ.. జులైలో కానీ మార్కెట్లలో ఎంట్రీ ఇచ్చేందుకు స్పేస్ఎక్స్ ప్లాన్ చేసింది. ఇందుకోసం ఇప్పటికే లీడ్ బ్యాంకర్లతో చర్చలు జరుపుతోంది. ఐతే స్పేస్ఎక్స్ ఐపీఓ కి రాబోతుందని ఐపిఓ తర్వాత కంపెనీ వేల్యేషన్ 800 బిలియన్ డాలర్లకి చేరుతుందని ఈ మధ్యనే కొన్ని కథనాలు రాగా..ఎలాన్ మస్క్ వాటిని ఖండించారు. ఐతే ఆ తర్వాతి రోజే ఇలా మరో న్యూస్ చక్కర్లు కొడుతుండటం విశేషం
స్పేస్ఎక్స్ సెకండ్ బిగ్గెస్ట్ వేల్యూడ్ స్టార్టప్‌గా మార్కెట్‌లో పేరు పడగా..దానికి ముందు చాట్ జిపిటి.. నంబర్ వన్‌గా కొనసాగుతోంది. ఓపెన్ ఏఐ కూడా వచ్చే సంవత్సరం ఐపిఓకి రానున్న నేపథ్యంలో స్పేస్ ఎక్స్ ఐపీఓకి ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఈ రెండు కంపెనీల మధ్య రేస్ ప్రారంభమైనట్లైంది.
Also Read: కాళ్ల బేరానికి వచ్చిన డొనాల్డ్ ట్రంప్..? రష్యాకి అదిరిపోయే ఆఫర్లు..!
