Worlds tallest dog dies : ప్రపంచంలోనే అత్యంత పొడవైన డాగ్ జుయస్ క్యాన్సర్‌తో మృతి
ప్రపంచంలోనే అత్యంత పొడవైన డాగ్ జుయస్ ఇక లేదు. తన ఎత్తుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన జుయస్ 3 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో చనిపోయింది.

Worlds tallest dog dies
Worlds tallest dog dies : ప్రపంచంలోనే అత్యంత పొడవైన గిన్నిస్ రికార్డ్ హోల్డర్ జుయస్ మూడు సంవత్సరాల వయసులో క్యాన్సర్‌తో చనిపోయింది. సెప్టెంబర్ 12 న చనిపోయినట్లు జుయస్ యజమాని వెల్లడించారు.
ప్రపంచంలోనే పొడవైన డాగ్ జుయస్ క్యాన్సర్‌తో చనిపోయింది. 1.046 మీ (3 అడుగుల 4.18 అంగుళాలు) పొడవుతో 2022లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను సంపాదించిన జుయస్ మూడు సంవత్సరాల వయసులో ఎముక క్యాన్సర్‌తో చనిపోయింది. ఈ విషయాన్ని జుయస్ యజమాని బ్రిటనీ డేవిస్ GoFundMe పేజీలో వెల్లడించారు.
Mumbai : కుక్కల మెడలో QR కోడ్ .. తప్పిపోయిన డాగ్స్ ట్రాక్ చేయడానికి క్రియేట్ చేసిన ఇంజనీర్
‘మాకు చాలా బాధని మిగిల్చి మా జుయస్ చనిపోయింది’ అంటూ డేవిస్ చెప్పారు. ప్రాణాలతో ఎంత పోరాడినా న్యూమోనియా ఎక్కువ కావడంతో చనిపోయినట్లు తెలిపారు. ఆగస్టు నుంచి జుయస్ ఎముక క్యాన్సర్‌తో బాధపడుతోందని.. ముందు కుడి కాలును తొలగించారని ఆయన చెప్పారు. జుయస్‌కి శస్త్ర చికిత్స కోసం అయ్యే ఖర్చు కారణంగా ఆమె GoFundMe పేజీని ప్రారంభించింది. ఆమె $12,000 ( ఇండియన్ కరెన్సీలో రూ.2,70,259) వసూలు చేసింది. జుయస్‌కి సెప్టెంబర్ 7 న శస్త్ర చికిత్స జరిగింది. అయితే తరువాత కొన్ని సమస్యలు ఎదురైనట్లు వైద్యులు చెప్పారు.
Worlds Ugliest Dog 2023 : ప్రపంచంలోనే అంద వికారమైన శునకంగా గెలుపొందిన ‘స్కూటర్’ అనే డాగ్
జుయస్‌కు బ్లడ్ టెస్ట్‌లు, ఛాతి ఎక్స్-రేలు తీసారు. న్యూమోనియాతో బాధపడుతోందని తేలింది. యాంటీబయాటిక్స్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. జుయస్ చివరికి డేవిస్ చేతుల్లోనే కన్నుమూసింది. డేవిస్‌కి జుయస్‌ను ఆమె సోదరుడు బహుమతిగా ఇచ్చాడు. డేవిస్‌తో వీధుల్లో తిరుగుతున్నప్పుడు అందరి దృష్టి జుయస్‌పైనే ఉండేది. మార్చి 2022 లో అత్యంత పొడవైన డాగ్‌గా జుయస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ దక్కించుకుని ఫేమస్ అయ్యింది.
View this post on Instagram