Mumbai : కుక్కల మెడలో QR కోడ్ .. తప్పిపోయిన డాగ్స్ ట్రాక్ చేయడానికి క్రియేట్ చేసిన ఇంజనీర్

అతను ఎంతగానో పెంచుకున్న డాగ్ కనిపించకుండా పోయింది. ఎంత ప్రయత్నం చేసినా దాని ఆచూకీ తెలియలేదు. ఈ సందర్భంలోనే అతనికో ఆలోచన వచ్చింది. తప్పిపోయిన డాగ్స్ ను ట్రాక్ చేయడానికి ముంబయి ఇంజనీర్ ఏమి చేశాడో చదవండి.

Mumbai : కుక్కల మెడలో QR కోడ్ .. తప్పిపోయిన డాగ్స్ ట్రాక్ చేయడానికి క్రియేట్ చేసిన ఇంజనీర్

Mumbai

Mumbai : ముంబయిలో శునకాలు తప్పిపోతే ఇప్పుడు వాటిని ట్రాక్ చేయడం సులభం. రిడ్లాన్ అనే ఇంజనీర్ వాటి కోసం QR కోడ్‌ను  క్రియేట్ చేశాడు. దానిని స్కాన్ చేస్తే చాలు ఆ డాగ్ పూర్తి సమాచారం వచ్చేస్తుంది.

Luxury house for a pet dog : పెంపుడు కుక్కకి రూ.25 వేల డాలర్ల లగ్జరీ హౌజ్ కట్టిన యూట్యూబర్

తప్పిపోయిన డాగ్స్‌ను ట్రాక్ చేయడానికి ముంబయికి చెందిన ఇంజనీర్ రిడ్లాన్ ఓ పరిష్కారాన్ని కనుగొన్నాడు. వాటి కోసం QR కోడ్‌ను కనిపెట్టాడు. QR కోడ్‌ను కుక్క కాలర్‌కు జోడించాలి. దానిని స్కాన్ చేసిన తర్వాత డాగ్ సమాచారం వస్తుంది. ట్యాగ్ ధర రూ.100 కాగా, రవాణా కోసం రూ.50 ఛార్జ్ చేయబడుతుందట. తను ఎంతగానో అభిమానించిన డాగ్ ‘కాళూ’ తప్పిపోయిన నేపథ్యంలో ఈ QR కోడ్ తయారు చేయాలనే ఆలోచన వచ్చిందట రిడ్లాన్‌కి. 2020 లో అతను ఓ వివాహానికి వెళ్లాడట. అక్కడ పెద్ద శబ్దంతో బాణాసంచా పేలడంతో అక్కడ ఉన్న డాగ్స్ అన్నీ భయంతో పరుగులు తీశాయట. అప్పుడు తప్పిపోయిన అతని డాగ్ కాళూ మళ్లీ కనిపిచంలేదట. డాగ్ లవర్ అయిన అతను సోషల్ మీడియా ద్వారా ఎన్నో కమ్యూనిటీలను సంప్రదించినా అతని డాగ్ మాత్రం దొరకలేదు. ఇక ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం QR కోడ్ క్రియేట్ చేయడానికి దారి తీసిందట. దీని ద్వారా కుక్క పేరు, వైద్య చరిత్ర, వాటి సంరక్షుల వివరాలు తెలుస్తాయి.

US University : యజమానితో పాటు డిప్లొమా డిగ్రీ అందుకున్న శునకం

కుక్కల కోసం మైక్రో చిప్‌లను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నా ఆర్ధికంగా సహకరించక ఆ ఆలోచనను విరమించుకున్నాడట. QR స్కాన్ ట్యాగ్‌లను ఆవులు, మేకలు ఇతర జంతువులపై కూడా ఉపయోగించవచ్చునని రిడ్లాన్ చెబుతున్నాడు. డేటాబేస్ విషయంలో మాట్లాడుతూ రిడ్లాన్ మొత్తం సమాచాన్ని సేవ్ చేయడానికి GCP (గూగుల్ క్లౌడ్ ప్లాట్ ఫారమ్) ని ఉపయోగిస్తున్నట్లు చెప్పాడు. అందుకోసం డబ్బులు చెల్లిస్తున్నానని చెప్పాడు. QR కోడ్‌లను రూపొందించడానికి అతని టీం మొత్తం డేటాను ధృవీకరిస్తుందట. ఇప్పటివరకూ అతను 500 ట్యాగ్‌లను పాన్-ఇండియాకు పంపినట్లు చెప్పాడు.