Luxury house for a pet dog : పెంపుడు కుక్కకి రూ.25 వేల డాలర్ల లగ్జరీ హౌజ్ కట్టిన యూట్యూబర్

శునకాలు పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. వాటిని ఇంట్లో వ్యక్తుల్లాగే ట్రీట్ చేస్తారు. వాటి పుట్టినరోజు వేడుకల్ని కూడా ఘనంగా జరుపుతారు. ఒక యూట్యూబర్ తన పెంపుడు శునకం కోసం అయితే రూ.25 వేల డాలర్లతో లగ్జరీ ఇల్లు కట్టాడు. శునకం పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చాడు.

Luxury house for a pet dog : పెంపుడు కుక్కకి రూ.25 వేల డాలర్ల లగ్జరీ హౌజ్ కట్టిన యూట్యూబర్

Luxury house for a pet dog

Viral Video : యూట్యూబర్ బ్రెంట్ రివెరా తన పెంపుడు కుక్క పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాలనుకున్నాడు. అందుకోసం ఓ ప్రణాళిక వేసుకున్నాడు. అతను శునకం కోసం చేసిన హడావిడి చూస్తే ఆశ్చర్యపోతారు.

US University : యజమానితో పాటు డిప్లొమా డిగ్రీ అందుకున్న శునకం

పెంపుడు జంతువులంటే యజమానులు ప్రాణం పెడతారు. వాటికి ఏ మాత్రం అనారోగ్యం చేసినా తల్లడిల్లిపోతారు. ఇక వాటి పుట్టినరోజులు కూడా ఘనంగా జరిపే వారు ఉన్నారు. యూట్యూబర్ బ్రెంట్ రెవెరా తన పెంపుడు కుక్క పుట్టినరోజును చాలా స్పెషల్ గా జరిపాడు. అతను శునకం కోసం $ 25,000 (రూ.20,60,087 ఇండియన్ కరెన్సీలో) ఖర్చుతో లగ్జరీ ఇంటిని నిర్మించాడు. ఈ ఇంటితో పాటు శునకం పుట్టినరోజు వేడుకల్ని వేడుకగా జరిపి తన ఛానెల్ లో పోస్ట్ చేశాడు.

 

రివెరా తన కుక్క చార్లీ పట్ల తనకున్న ప్రేమను చాటుకోవాలనుకున్నాడు. చార్లీ పుట్టినరోజు ఎలా చేయాలనుకుంటున్నాడో చెబుతూ వీడియో మొదలవుతుంది. ఇల్లు కట్టే ప్లాన్‌తో పాటు స్నేహితుల సాయం ఎలా తీసుకున్నాడో వీడియోలో వివరించాడు. బెడ్ రూం, లివింగ్ రూంతో చార్లీ ఇల్లు అందంగా రూపుదిద్దుకుంది. చార్లీ పుట్టినరోజున ఇంటిని ఆవిష్కరించారు. పుట్టినరోజు వేడుకలకు చార్లీ స్నేహితులు కూడా వచ్చారు. చార్లీ ఇంట్లో బెడ్‌తో పాటు ఉడుత వీడియోలు మాత్రమే ప్లే చేసే టీవీని కూడా అమర్చారు. ఇలా చార్లీకోసం పుట్టినరోజు వేడుకలతో వీడియో ముగుస్తుంది. ఇక ఈ వీడియో వైరల్ అవుతోంది.

intelligent dog : ఆ శునకం మహా ముదురు .. చదివింది చేసి చూపిస్తున్న డాగ్ వీడియో వైరల్

‘చార్లీ చాలా సంతోషంగా ఉందని.. అందుకు తాను అర్హురాలు’ అని.. ‘చార్లీ ఇల్లు చాలా అందంగా ఉందని.. నేను చూసిన అపురూపమైన వీడియో ఇదేనని’ కామెంట్లు పెట్టారు. పెంచుకున్న శునకంపై ఇంత అభిమానాన్ని చాటుకున్న రివెరాపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.