జస్ట్ 5 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జింగ్.. త్వరలో అందుబాటులోకి సరికొత్త టెక్నాలజీ

Xiaomi might launch smartphone with 200W charging: సాధారణంగా మొబైల్ ఫోన్ ఫుల్ గా ఛార్జ్ కావాలంటే ఛార్జర్‌ను బట్టి అరగంట నుంచి దాదాపు రెండు గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఫాస్ట్ ఛార్జర్స్ ఉంటే అంతకన్నా తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జర్‌తోపాటు కొత్తగా ఎయిర్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ఎంఐ తీసుకొచ్చిన ఎయిర్ ఛార్జర్ ద్వారా కేవలం 20నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. రియల్‌మీకి చెందిన 65వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను 40 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు.
ఎయిర్ ఛార్జర్ టెక్నాలజీతో ఫోన్ ఛార్జర్‌కు కనెక్ట్ చేయకుండా దూరం నుంచి ఛార్జ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కేబుల్స్, ఛార్జింగ్ స్టాండ్ అవసరం లేదు. దీని సాయంతో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు.
కాగా, ప్రస్తుతం షావోమీ 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చని ఆ కంపెనీ తెలిపింది. ఇది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అయితే తొలుత చైనాలో విడుదల చేయనుంది. మరోవైపు రియల్‌మీ 125W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కమర్షియల్‌గా తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 120W ఛార్జర్‌ను వివో iqoo 7 విడుదల చేసిన విషయం తెలిసిందే.
వైర్డ్, వైర్‌లెస్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందించే అవకాశం ఉంది షావోమీ. ఈ ఏడాదిలోనే షావోమీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావొచ్చు. షావోమీ త్వరలో రిలీజ్ చేయబోయే ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌తో 200వాట్ ఛార్జర్ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. లేదా ఎంఐ మిక్స్ స్మార్ట్‌ఫోన్‌కు ఈ ఛార్జర్ ఇవ్వొచ్చు.
ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్లకు 5వాట్ ఛార్జింగ్ ఉండేది. ఆ తర్వాత 10వాట్ ఛార్జర్లు వచ్చాయి. కొన్నాళ్లకు 18వాట్, 33వాట్ ఛార్జర్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం షావోమీ స్మార్ట్‌ఫోన్లలో 33వాట్ ఛార్జర్లను ఇస్తోంది. రియల్‌మీ 65వాట్ ఛార్జర్లను ఇస్తోంది. అంతకన్నా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని రియల్‌మీ పరీక్షించినా ఇంకా ఛార్జర్లను ఇవ్వట్లేదు. గతంలో ఎంఐ 10 ఎక్స్‌స్ట్రీమ్ కమ్మొమొరేటీవ్ ఎడిషన్‌కు 120వాట్ వైర్డ్ ఛార్జింగ్, 55వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్, 10వాట్ రివర్స్ ఛార్జింగ్ అందించింది షావోమీ.