United Kingdom : ఎంతకాలం ఎదురుచూసినా పెళ్లికొడుకు దొరకలేదట.. చివరికి ఆమె ఏం చేసిందంటే?

ఓ మహిళ తన పెళ్లి వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంది. అందుకోసం చాలా డబ్బులు జమ చేసింది. ఎన్ని సంవత్సరాలు గడిచినా సరైన వరుడు దొరకలేదు. చివరికి ఆమె ఏం చేసిందో చదవండి.

United Kingdom : ఎంతకాలం ఎదురుచూసినా పెళ్లికొడుకు దొరకలేదట.. చివరికి ఆమె ఏం చేసిందంటే?

United Kingdom

United Kingdom : పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు.. నిజమే. పెళ్లి త్వరగా చేసుకోవాలని అనుకున్నా తగిన వ్యక్తి దొరకడం అంత సులభం కాదు. జీవితకాలం ఒకరితో కలిసి జీవించాలనుకునే వారు ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఓ మహిళకు ఎంతకాలం వేచి చూసినా తగిన వరుడు దొరకలేదట. చివరికి ఆమె ఏం చేసిందో చదవండి.

Viral Video : టీవీ షో డిబేట్‌లో కొట్టుకున్న పొలిటీషియన్స్ .. వైరల్ అవుతున్న వీడియో

కొన్ని సంఘటనలు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కానీ లోతుగా ఆలోచిస్తే విషయం అర్ధం అవుతుంది. యునైటెడ్ కింగ్ డమ్‌కి చెందిన 42 సంవత్సరాల సారా విల్కిన్సన్ అనే మహిళ 20 ఏళ్లుగా తన పెళ్లి కోసం కొంత డబ్బు పొదుపు చేస్తూ వచ్చిందట. సరైన జీవిత భాగస్వామి దొరకకపోవడంతో ఆమెకు పెళ్లి కాలేదు. చివరికి ఆమె ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఏం చేసిందంటే?

విల్కిన్సన్ తనను తానే పెళ్లాడాలని నిర్ణయం తీసుకుంది. నిజమే. తన పెళ్లి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ఉండిపోయిన తన కోరికను నెరవేర్చుకోవడం కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. సఫోల్క్ ఫెలిక్స్‌స్టోవ్‌లోని హార్వెస్ట్ హౌస్‌లో ఆమె ఈ వేడుకను నిర్వహించింది. ఇది అధికారికంగా పెళ్లి కాకపోయినప్పటికీ .. తన జీవిత భాగస్వామితో ఈ వేడుక జరగకపోయినప్పటికీ తన సంతోషాన్ని ఎందుకు పోగొట్టుకోవాలని విల్కిన్సన్ చెప్పిందట. తన పెళ్లి కోసం దాచుకున్న డబ్బులతో వేడుక జరుపుకున్నట్లు ఆమె సంబరపడుతూ చెప్పిందట. ఈ వేడుక కోసం ఆమె 10,000 పౌండ్లు (రూ.10,11,421) వెచ్చించిందట.

Bengaluru : ట్రాఫిక్‌లో చిక్కుకున్నవారి ఆకలి కష్టాలు.. ఫుడ్ డెలివరీ చేసిన డోమినోస్ ఏజెంట్లు వీడియో వైరల్

సెప్టెంబర్ 30 న విల్కిన్సన్ జరుపుకున్న వేడుకలో 40 మంది కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు పాల్గొన్నారట. సాయంత్రం వేళ మరో 40 మందితో టెన్సిస్ క్లబ్‌లో సంబరాలు జరుపుకుందట. సో విల్కిన్సన్ తన జీవితంలో జరగదనుకున్న వేడుకను ఇలా సెలబ్రేట్ చేసుకుందన్నమాట.