Zilingo Ankiti Bose : ఆధారాలు లభ్యం.. అంకితి బోస్‌కు జిలింగో బిగ్ షాక్
సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న ఫ్యాషన్ టెక్నాలజీ స్టార్టప్ జిలింగో.. భారత సంతతికి చెందిన అంకితి బోస్‌కు బిగ్ షాక్ ఇచ్చింది.(Zilingo Ankiti Bose)

Zilingo Ankiti Bose
Zilingo Ankiti Bose : సింగపూర్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న బీ2బీ ఫ్యాషన్ టెక్నాలజీ ఈ- కామర్స్ స్టార్టప్ జిలింగో.. భారత సంతతికి చెందిన సహ వ్యవస్థాపకురాలు, సీఈవో అంకితి బోస్ కు బిగ్ షాక్ ఇచ్చింది. సీఈవో అంకితి బోస్ ను సంస్థ నుంచి తొలగించింది జిలింగో. అంకితి బోస్ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలు లభించడమే ఇందుకు కారణం అని జిలింగో వివరించింది. ఈ-కామర్స్ సంస్థగా ప్రారంభమైన జిలింగో.. అనతి కాలంలోనే పాపులర్ అయ్యింది. దుస్తుల పరిశ్రమ, ఫైనాన్సింగ్ సహా మరిన్ని టెక్ ఆధారిత సేవల గ్లోబల్ సప్లయ్ చైన్ లో భాగమైంది.

Ankiti Bose
అంకితి బోస్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో మార్చి 31న జిలింగో ఆమెను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత స్వతంత్ర ఫోరెన్సిక్ సంస్థలతో దర్యాప్తు జరిపించింది. విచారణలో ఆమెపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లభించడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు జిలింగో వెల్లడించింది. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.(Zilingo Ankiti Bose)

Ankiti Bose (1)
Sun Rare Images : సూర్యుడి అరుదైన చిత్రాలు..తొలిసారిగా కెమెరాకు చిక్కాయి
తనని సంస్థలో వేధింపులకు గురిచేస్తున్నారని ఏప్రిల్ 11న తొలిసారి అంకితి బోస్ బోర్డు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన దర్యాప్తు సంస్థ.. సస్పెండ్ అయిన తర్వాతే ఈ ఆరోపణలు తెరమీదకు వచ్చాయని తెలిపింది. మీడియాలో వస్తున్నట్లుగా ఈ వేధింపుల ఫిర్యాదుల నుంచి తప్పించుకోవడానికే కంపెనీ ఆమెను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవంది.

Ankiti Bose (2)
ప్రస్తుతం జిలింగో సంస్థలో 600 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2019లో వివిధ కంపెనీల నుంచి 226 మిలియన్ డాలర్ల నిధుల్ని సమీకరించింది. దీంతో కంపెనీ విలువ ఒక బిలియన్ డాలర్లకు చేరింది. 8 దేశాల్లో జిలింగో వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. 7వేల కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి.(Zilingo Ankiti Bose)
Elon Musk: ఎలన్ మస్క్‌పై ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు రూ.194కోట్లు నిజమేనా..
భారత్‌కు చెందిన 30 ఏళ్ల అంకితి బోస్… చిన్న వయసులోనే సంస్థను ముందుండి నడిపించారు. ఆసియా నుంచి తొలిసారిగా యూనికార్న్ క్లబ్‌లో అడుగుపెట్టేలా చేశారు. ఇంతలోనే అవినీతి మరక అలజడి రేపింది. జిలింగోలో పెట్టుబడిదారులైన టెమాసెక్, సీక్వోయా క్యాపిటల్ తో పాటు ఇతర సంస్థలు నిర్వహించిన అంతర్గత విచారణలో కంపెనీలో అవకతకలు జరిగినట్లు గుర్తించారు. ఆమెపై సస్పెన్షన్ విధించారు. ఇప్పుడు.. శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Zilingo
ఇది ఇలా ఉంటే.. తనని జిలింగో అక్రమంగా విధుల నుంచి తొలగించిందని అంకితి బోస్ ఆరోపించారు. సీఈవో హోదాలో ఉన్న తనపై వేధింపులు ఎదురయ్యాయని, ఇదే విషయంపై యాజమాన్యాన్ని నిలదీయడంతో.. తనపై సస్పెన్షన్ విధించారంది. వేధింపులపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ముందు నిలదీశానని, అందుకే తనపై అవినీతి ఆరోపణలు చేసి, నిందలు మోపి కుట్ర పన్ని బయటకు పంపేశారని అంకితి బోస్ వాపోయారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానన్న అంకితి.. జిలింగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు లీగల్ నోటీసులు కూడా పంపారు.(Zilingo Ankiti Bose)