Womens work In Mines : రత్నాల గనిలో మహిళలకు మాత్రమే ఉద్యోగం.. ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచ దేశాలు ప్రశంసించేంతగా అక్కడేం జరుగుతుందో తెలుసా..?

రత్నాల గనిలో కాయకష్టం చేస్తున్న మహిళలు కొండల్ని పిండి చేస్తున్నారు. ఆగనుల్లో మహిళలకు మాత్రమే పనిచేస్తారు. వారు చేసే పనిని ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచదేశాలు ప్రశంసిస్తుంటాయి.

Womens work In Mines : రత్నాల గనిలో మహిళలకు మాత్రమే ఉద్యోగం.. ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచ దేశాలు ప్రశంసించేంతగా అక్కడేం జరుగుతుందో తెలుసా..?

zimbabwe mines only women jobs

zimbabwe mines only women s jobs : గనిలో పని అంటే చాలా కఠినంగా ఉంటుంది. పెద్ద పెద్ద బండల్ని పగులగొట్టాలి. మైనంగ్ లో పనిచేయాలంటే పెద్ద పెద్ద భారీ బరువైన సుత్తుల్ని ఉపయోగించాలి. మైనింగ్ పని అంటే కొండల్ని పిండికొట్టాలి. అలా కొండల్ని పగుల గొట్టాలంటే సులువైన సాధనం పేలుడు పదార్ధాలు ఉపయోగిస్తుంటారు. కొండల్లో అక్కడక్కడా పేలుడు పదార్ధాలతో పెట్టి పేలుస్తారు. అలా కొండలు పెద్ద పెద్ద బండరాళ్లుగా ముక్కలవుతుంటాయి. వాటిని పెద్ద పెద్ద సుత్తులతో పగులగొడుతుంటారు. మైనింగుల్లో అతి కఠినంగా ఉండే ఇలాంటి పనులే ఉంటాయి. అందుకే మైనింగుల్లో పురుషులే పనిచేస్తుంటారు.

కానీ.. ఓ మైనింగ్ లో మాత్రం మహిళలే పనిచేస్తుంటారు. కొండల్ని పిండి చేస్తుంటారు. బండల్లోని రత్నాలను వెలికి తీస్తుంటారు. ఉత్తర జింబాబ్వేలోని డుంగుజా నది వద్ద మైనింగ్ జరుగుతుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా మైనింగ్ ల్లో అంతా పురుషులే పనిచేస్తుంటారు. కానీ ఇక్కడ జరిగే మైనింగ్ లో అందరు మహిళలే పనిచేస్తుంటారు. పురుషులకు ఏమాత్రం తక్కువకాదన్నట్లుగా ఇక్కడ పనిచేసే మహిళలు అంతా సుత్తులు,ఉలులను ఉపయోగించి కఠినమైన పనిచేస్తుంటారు. సాధారణంగా అన్ని మైనింగుల్లోను కొండల్ని పగులగొట్టేందుకు పేలుడు పదార్ధాలు ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ మైనింగులో ఎటువంటి పేలుడు పదార్ధాలు ఉపయోగించరు. మాన్యువల్ గానే కొండల్ని పగులగొడుతుంటారు. ఆ కఠినమైన పని చేసేది మహిళలే కావటం ఓ విశేషమైతే..ఇక్కడ పేలుడు పదార్ధాలు ఉపపయోగించకుండా పర్యావరణహితంగా కొండల్ని పగులగొట్టే మహిళల పనితీరును ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించటం..ఐక్యరాజ్యసమితితో పాటు ఇక్కడ జరిగే పనిని ప్రపంచంలోనే పలు దేశాలు ఆసక్తిగా గమనిస్తుండటం మరో విశేషం.

Also Read : ప్రపంచంలోనే అతి సన్నని హోటల్.. ప్రత్యేకతలు మామూలుగా లేవుగా..

డుంగుజా నది వద్ద మైనింగ్ లో రత్నాల కోసం ‘జింబాకువా’ లాంటి అనేక కంపెనీలు ఇక్కడ వెదుకులాట సాగిస్తుంటాయి. ఈ పనిని కేవలం మహిళలు మాత్రమే చేస్తుంటారు. పెద్ద పెద్ద మిషన్లతో డ్రిల్లింగ్ చేసినా..పెద్ద పెద్ద బండరాళ్లను భారీ సుత్తితో కొట్టే పని అయినా..భారీ సైజులో ఉండే బండరాళ్లను రవాణా చేయడమైనా.. ప్రతీ పనీ మహిళలే చేస్తుంటారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ గనిలో ఎటువంటి పేలుళ్లు చేయరు.అంతా చేతులతోనే పని జరుగుతుంటుంది.

ఈ భూమిలోను..కొండ పొరల్లోను విలువైన మేలిమి రాళ్లు, రత్నాలు లభిస్తుంటాయి. వాటిని మహిళలు ఉలి, సుత్తి సహాయంతో వెలికి తీస్తుంటారు. ఇటువంటి పనితీరు వల్ల పర్యావరణానికి హాని కలగదు. పనిలో నీటిని కూడాచాలా తక్కువగా ఉపయోగిస్తారు. అందుకే ఇక్కడ మైనింగ్ లో మహిళల కష్టాన్ని..పర్యావరణానికి హాని చేయని పనితీరును ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచలోని పలు దేశాలు ప్రశంసిస్తుంటాయి.

Also Read : కదులుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ

ఇంత కాయకష్టం చేసే మహిళలకు నెలకు 180 యూరోలు జీతంగా ఇస్తాయి అక్కడ కంపెనీలు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితితెలిపింది. ఒక యూరో అంటే భారత కరెన్సీలో రూ.91. మహిళా సాధికారత కోసమే ఇలా ఇక్కడి మైనింగులో మహిళలకు మాత్రమే పని ఇస్తామని కంపెనీలు చెబుతున్నాయి. ఇక్కడ పనిచేసే మహిళలు ఏమాత్రం ఖాళీగా ఉండకుండా పనిలేని సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. కూరగాయలు పండిస్తూ, వాటిని విక్రయిస్తు కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటారు. తమ పిల్లల చదువుల కోసం వాటిని ఉపయోగించుకుంటుంటారు.