World Largest Iceberg : కదులుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ

సుమారు 4 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ మంచు కొండ అంటార్కిటికా మహాసముద్రంలో ప్రమాదకరంగా ముందుకు దూసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.

World Largest Iceberg : కదులుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ

world largest iceberg

World Largest Iceberg Moving : ప్రపంచంలోనే భారీ మంచుకొండ కదులుతోంది. అంటార్కిటికా నుంచి విడిపోయిన అతి పెద్ద మంచుకొండ మహాసముద్రంలో ముందుకు కదులుతోంది. ఏ 23ఏగా పిలువబడుతున్న ఈ మంచుకొండ న్యూయార్క్ నగరమంత పరిమాణంలో ఉందని పరిశోధకులు గుర్తించారు. మూడు దశాబ్ధాల తర్వాత తొలిసారి ముందుకు కదులుతున్నట్లు వెల్లడించారు.

సుమారు 4 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ మంచు కొండ అంటార్కిటికా మహాసముద్రంలో ప్రమాదకరంగా ముందుకు దూసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మంచుకొండ పశ్చిమ అంటార్కిటికా నుంచి 1986లో విడిపోపోయింది. అప్పటినుంచీ కదలకుండానే ఉంది.

Michaung Cyclone : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ గా మిచాంగ్.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అయితే, ట్రిలియన్ మెట్రిక్ టన్నుల బరువు ఉన్న ఈ మంచుకొండ బలమైన గాలులు, ప్రవాహాల వల్ల ఇటీవల అంటార్కిటికా ద్వీపకల్పం ఉత్తరకొనను దాటి ముందుకు కదులుతున్నట్లు గుర్తించారు.