MI vs RCB : తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ శర్మ రనౌట్..
ఐపీఎల్ సీజన్ 14 ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. యజువేంద్ర చాహల్ బౌలింగ్ లో కోహ్లీ రోహిత్ ను రనౌట్ చేశాడు.

Mi Vs Rcb Rcb Chose To Field, Season First Match 2021 (3)
IPL 2021 : ఐపీఎల్ సీజన్ 14 ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. యజువేంద్ర చాహల్ బౌలింగ్ లో కోహ్లీ రోహిత్ ను రనౌట్ చేశాడు. 3.6 ఓవర్ల వద్ద జట్టు స్కోరు 24 పరుగుల చేయగా.. రోహిత్ మొదటి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. చాహల్ వేసిన నాలుగో ఓవర్ చివరి బంతికి రోహిత్ (19) ఔటయ్యాడు.
క్రిస్‌లిన్ ఆడిన బంతికి అనవసర పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. ముంబై 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(5) బౌండరీ బాదేశాడు.
Sharp bit of fielding from the #RCB Skipper and Rohit Sharma is run out for 19.
Live – https://t.co/9HI54vpf2I #VIVOIPL #MIvRCB pic.twitter.com/ibQLfa7sOW
— IndianPremierLeague (@IPL) April 9, 2021
జేమీసన్ వేసిన తొలి బంతికి ఫోర్ కొట్టాడు. మరో బంతికి సింగిల్ తీశాడు. క్రిస్‌లిన్(6) సింగిల్ తీశాడు. ప్రస్తుతం క్రీజులో క్రిస్ లెన్ (6) నాటౌట్, సూర్యకుమార్ యాదవ్ (5) నాటౌట్ గా ఉన్నారు. 5 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది.