IPL 2021: MI vs PBKS: ముంబైని కట్టడి చేసిన పంజాబ్.. టార్గెట్ 132

Mumbai Indians Target To Punjab Kings For 132 Runs In Ipl 2021
IPL 2021: MI vs PBK : ఐపీఎల్ లీగ్ 2021లో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేసింది. ప్రత్యర్థి జట్టు పంజాబ్ కింగ్స్ కు 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(63; 52 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సులు), సూర్యకుమార్ యాదవ్(33; 27 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) రాణించారు. రోహిత్ హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో మూడు అంకెల స్కోరు చేయగలిగింది.
ముంబై ఓపెనర్ డికాక్ (3) పరుగులకే ఆదిలోనే చేతులేత్తేశాడు. ఇషాన్ కిషన్(6) పెవిలియన్ చేరాడు. 26 పరుగులకే ముంబై రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఉన్న కెప్టెన్ రోహిత్, సూర్య కుమార్ యాదవ్ దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు.
Innings Break: @mipaltan post 131-6 from their 20 overs after being asked to bat first by @PunjabKingsIPL. https://t.co/NMS54FiJ5o #VIVOIPL #PBKSvMI pic.twitter.com/MetpFHdkyD
— IndianPremierLeague (@IPL) April 23, 2021
వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో రోహిత్, యాదవ్ దూకుడుకు బ్రేక్ వేశారు. ముందుగా సూర్యకుమార్ ను పెవిలియన్ పంపిన పంజాబ్ కింగ్స్ బౌలర్లు.. ఆ తర్వాత రోహిత్ ను కూడా వరుస ఓవర్లలో పెవిలియన్ పంపారు.
హార్దిక్ పాండ్య(1), కృనాల్ పాండ్య(3) పేలవ ప్రదర్శనతో సింగిల్ డిజిట్ కే పరిమితయ్యారు. ఇక పొలార్డ్(16 నాటౌట్)గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమి, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు తీయగా.. దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు.
ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్ లు ఆడగా.. రెండు మ్యాచ్ లు గెలిచింది.. మరో రెండు మ్యాచ్ ల్లో ఓడింది. పాయింట్ల పట్టికలో ముంబై 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా 4 మ్యాచ్ లు ఆడగా.. ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచింది.. మూడు మ్యాచ్ ల్లోనూ ఓటమి చవిచూసింది. పాయింట్ల పట్టికలో కింగ్స్ 2 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది.