Rohit Sharma: అశ్విన్ బౌలింగ్‌లో హిట్ మ్యాన్ ఒంటి చేత్తో సిక్స్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చక్కటి ఫామ్ ...

Rohit Sharma: అశ్విన్ బౌలింగ్‌లో హిట్ మ్యాన్ ఒంటి చేత్తో సిక్స్

Rohit Sharma Smashes One Handed Six Against R Ashwin

Updated On : April 21, 2021 / 8:06 AM IST

Rohit Sharma: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చక్కటి ఫామ్ కనబరిచాడు. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేవలం 30బంతుల్లో 44పరుగులు చేసి జట్టుకు స్కోరు అందించి శుభారంభాన్ని ఇచ్చాడు.

ముంబై మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ తొలి వికెట్ గా ఓడిపోయినప్పటికీ రెండో వికెట్ కు రోహిత్.. సూర్య కుమార్ యాదవ్ (24)తో కలిసి 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో మూడు ఫోర్లు, మూడు సిక్సులతో అద్భుతమైన షాట్లు ఆడాడు.

ఈ ప్రక్రియలోనే అశ్విన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ ఒంటి చేత్తో సిక్సు కొట్టేశాడు. 4వ ఓవర్ చివరి బంతిని ఒంటి చేత్తో ఆడాడు. వీరోచిత ఇన్నింగ్స్ ఆడుతున్న రోహిత్ ను అమిత్ మిశ్రా 9వ ఓవర్లో అవుట్ చేశాడు. హాఫ్ సెంచరీకి 6పరుగుల దూరంలోనే పెవిలియన్ కు పంపాడు.

మంగళవారం జరిగిన మ్యాచ్ తో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియనస్ ఆడిన మూడింటిలో చెరో రెండు మ్యాచ్ లు గెలిచినట్లు అయింది.