IPL 2021 – KKR: కోల్‌కతా అభిమానులను క్షమాపణ కోరిన షారూఖ్ ఖాన్

కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారూఖ్ ఖాన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరిగిన ముంబై ఇండియన్స్ తో...

IPL 2021 – KKR: కోల్‌కతా అభిమానులను క్షమాపణ కోరిన షారూఖ్ ఖాన్

Shah Rukh Khan Apologises To Kkr Fans After Disappointing Performance Vs Mumbai Indians

Updated On : April 14, 2021 / 11:21 AM IST

IPL 2021 – KKR: కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారూఖ్ ఖాన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరిగిన ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ప్రదర్శనపై క్షమాపణ కోరాడు. ఏప్రిల్ 13న చిదంబరం స్టేడియం వేదికగా కోల్ కతా 10పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనిపై స్పందించిన షారూక్.. అభిమానులను క్షమించాలని అడుగుతున్నాడు.

15వ ఓవర్ వరకూ కంట్రోల్ ఉన్న కేకేఆర్ టీం.. ఒక్కసారిగా కుదేలు అయింది. క్రీజులో రస్సెల్, కార్తీక్ లు ఉన్నారు. ఆ సమయంలో ముంబై స్పిన్నర్ల తర్వాత బౌల్ట్, బుమ్రాలను దింపింది. బౌల్ట్ చివరి ఆరు బంతుల్లో 15పరుగులు మాత్రమే కావాల్సి ఉన్న సమయంలో బౌలింగ్ వేసి రస్సెల్, కమిన్స్ లను అవుట్ చేసి తారుమారు చేసేశాడు.

అంతకంటే ముందు టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇయోన్ మోర్గాన్ కెప్టెన్సీలో గత మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై మ్యాచ్ గెలిచిన జట్టుతోనే బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్ లో కోల్కత్తా 10పరుగుల తేడాతో గెలుపొందింది. కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్ ను ఏప్రిల్ 18న చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.