IPL 2021 Sourav Ganguly : ఆట ఆడేనా.. ఐపీఎల్​‌పై గంగూలీ షాకింగ్ కామెంట్స్

కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 14వ సీజన్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించారు. కరోనా కారణంగా జరగని మ్యాచ్‌లను ఇండియాలో నిర్వహించే అవకాశం లేదని తెలిపారు. ఐపీఎల్‌ నిర్వహణ కూడా ఇప్పట్లో కష్టమేనని స్పష్టం చేశారు.

IPL 2021 Sourav Ganguly : ఆట ఆడేనా.. ఐపీఎల్​‌పై గంగూలీ షాకింగ్ కామెంట్స్

Sourav Ganguly Shocking Comments On Ipl 2021 Tournament

Updated On : May 10, 2021 / 7:35 AM IST

Sourav ganguly IPL 2021 : కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 14వ సీజన్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించారు. కరోనా కారణంగా జరగని మ్యాచ్‌లను ఇండియాలో నిర్వహించే అవకాశం లేదని తెలిపారు. ఐపీఎల్‌ నిర్వహణ కూడా ఇప్పట్లో కష్టమేనని స్పష్టం చేశారు. జూన్‌లో న్యూజిలాండ్‌తో ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిసిన తర్వాత జూలైలో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుందని గంగూలీ క్లారిటీ ఇచ్చారు. శ్రీలంక పర్యటనలో కోహ్లీసేన మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని వెల్లడించారు. దీంతో జూలైలో భారత్‌, శ్రీలంక మధ్య సిరీస్‌ ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది.

దీంతో ఇప్పట్లో ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌ల నిర్వహణ అనుమానంగా మారింది. అయితే ముందుగా అనుకున్న ప్రకారం సెప్టెంబర్‌ విండోలోనే ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌లను నిర్వహించే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే.. ఈ ఏడాది మొత్తంలో ఐపీఎల్​ ఫేజ్​-2 మ్యాచ్​లను ఇండియాలో నిర్వహించడం కష్టమే. బయో బబుల్‌ను మరింత పొటెన్షియల్‌గా మార్చినా.. కరోనా కేసులు పెరుగుతున్న టైమ్​లో మళ్లీ మ్యాచ్‌లంటే ప్రతి ఒక్కరూ విమర్శలకు దిగుతారు. దీనికి తోడు స్వదేశాలకు వెళ్లిపోయిన ఫారిన్​క్రికెటర్లు మళ్లీ ఇండియాకు రావడానికి ఇష్టపడకపోవచ్చు.

కానీ ఓవర్​సీస్​లో మ్యాచ్​లకు ఒకటి, రెండు ప్రపోజల్స్​వచ్చాయని.. వాటికి అనుగుణంగా బీసీసీఐ రెడీ అయిపోతే సరిపోతుందని తెలుస్తోంది. ఒకవేళ బోర్డు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలనుకుంటే బీసీసీఐ ముందుకు.. యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా రేస్​లోకి వస్తున్నట్లు సమాచారం. కాసులు కురిపించే లీగ్​కావడంతో ఇంగ్లీష్​కౌంటీలు కూడా హోస్టింగ్స్‌కు మొగ్గు చూపుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్‌లో విండో దొరుకుతుందని ఆశాభావంతో ఉన్న బీసీసీఐకి ఇది ఓ రకంగా బూస్టింగ్​ఇచ్చే అంశమే. మరి మెగా లీగ్​ఫ్యూచర్​ను బోర్డు ఎలా డిసైడ్​చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.