అప్లై చేసుకోండి: DRDOలో 185 ఉద్యోగాలు

  • Published By: dharani ,Published On : May 25, 2020 / 10:36 AM IST
అప్లై చేసుకోండి: DRDOలో 185 ఉద్యోగాలు

Updated On : May 25, 2020 / 10:36 AM IST

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో 185 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. వీటితోపాటుగా మరో 18 పోస్టుల్ని జతచేసి కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు మే 22 నుంచి జూలై 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.     

విభాగాల వారీ ఖాళీలు: 
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో 41ఖాళీలు.
మెకానికల్ ఇంజనీరింగ్ లో 43 ఖాళీలు.
కంప్యూటర్ సైన్స్ లో 32 ఖాళీలు.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో 12 ఖాళీలు. 
మెటలర్జీ లో 10 ఖాళీలు, ఫిజిక్స్ 8, కెమిస్ట్రీ 7, కెమికల్ ఇంజనీరింగ్ 6, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 9,  సివిల్ ఇంజనీరింగ్ 3, మ్యాథమెటిక్స్ 4 అండ్ సైకలాజీలో 10ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్‌ లేదా‌ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులను గేట్, నెట్ స్కోర్ ద్వారా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు ప్రారంభం: మే 22, 2020.

దరఖాస్తు చివరి తేది: జులై 7, 2020.