రైల్వేలో 6,238 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. జీతం ఎంతో తెలుసా.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.. జులై 28 లాస్ట్ డేట్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Railway jobs
RRB Technician Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ లేదా గ్రేడ్-III పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 6,238 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 28వ తేదీలోపు rrbapply.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 30 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 1 నుండి 10 వరకు సవరణకు అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
♦ టెక్సీషియన్ గ్రేడ్-I సిగ్నల్ ఉద్యోగాల కోసం 18-33 ఏళ్ల వారు.
♦ టెక్నిషియన్ గ్రేడ్ -III పోస్టులకు 18-30ఏళ్ల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. (జూలై 1, 2025 నాటికి)
ఉద్యోగాలు ఎన్ని.. జీతం ఎతంటే?
♦ టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్
♦ పే లెవల్ – లెవల్-5
♦ నెలవారీ జీతం : రూ.29,200
♦ ఖాళీలు :183
♦ టెక్నీషియన్ గ్రేడ్-III
♦ పే లెవల్ – లెవల్-2
♦ నెలవారీ జీతం : రూ.19,900
♦ ఖాళీలు : 6,055
అర్హతలు, వయోపరిమితి.. ఎంపిక విధానం..
♦ టెక్నీషియన్ గ్రేడ్-I పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇనుస్ట్రుమెంటేషన్, బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత ట్రేడులో మూడేండ్ల డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
♦ టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు పదో తరగతి లేదా సమాన అర్హతతో పాటు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ , మెకానిక్ మెకట్రానిక్స్, మెకానిక్ (డిజిల్), వెల్డర్, మెషినిస్ట్ ట్రేడుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం ..
♦ రాత పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే, టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు వేరువేరుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.
అవసరమైన పత్రాలు ..
♦ పాస్‌పోర్ట్ సైజు ఫొటో, సంతకం (స్కాన్ చేయబడింది)
♦ ఐడీ కార్డు (ఆధార్ లేదా పాన్, పాస్‌పోర్ట్ మొదలైనవి)
♦ విద్యా ధ్రువపత్రాలు.
♦ కుల/నివాస ధ్రువీకరణ పత్రం
♦ మీరు 2024 లో ఏదైనా RRB పరీక్షకు ఇప్పటికే రిజిస్టర్ చేసుకుని ఉంటే, మళ్ళీ సైన్ అప్ చేయవలసిన అవసరం లేదు. అదే ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
అప్లికేషన్ ఫీజు..
♦ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250, ఇతర అభ్యర్థులకు రూ. 500.
ఇలా దరఖాస్తు చేయాలి
♦ అర్హత కలిగిన అభ్యర్థులు rrbapply.gov.in ద్వారా అప్లికేషన్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
♦ ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీ.
♦ చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్ (ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, మొదలైనవి).
♦ విద్యా అర్హత సర్టిఫికెట్లు, కుల లేదా వర్గం సర్టిఫికెట్.
♦ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లయితే, నివాస ధృవీకరణ పత్రం
♦ దరఖాస్తులను అధికారిక నియామక పోర్టల్ ద్వారా మాత్రమే సమర్పించాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులకు అనుమతి లేదు.