‘Mansion’ : గదులే లేని వింత ఇల్లు : ధర 7.4 కోట్లు

ఇల్లు అంటే కిటికీలు, రూములు ఉంటాయనే విషయం తెలిసిందే.కానీ రూములు, కిటికీలు లేని ఓ ఇల్లు రూ.7.4 కోట్ల ధరకు అమ్మకానికి వచ్చింది. ఇల్లు చూస్తే కంగారు..ధర వింటే బేజారుగా ఉండే ఈ వింత ఇల్లు కొనటం ఎలా ఉన్నా చూడాల్సిందే.

‘Mansion’ : గదులే లేని వింత ఇల్లు : ధర 7.4 కోట్లు

Fake Windows And No Bedrooms House Cost 1 Million Dollars

No Bedrooms House Cost 1 Million Dollars : అది యూఎస్ లోని టెక్సాస్‌ డల్లాస్‌ పట్టణంలో ఓ ఇల్లు. ఇది అమ్మకానికి వచ్చింది.దాని ఖరీదు 1 మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే.. 7,43,79,300 రూపాయలు. ఇంత ఖరీదు ఉందీ అంటూ లోపల ఇంకెంత గ్రాండ్ గా ఉంటుందో ఎంత డెరకేటెడ్ గా ఉంటుంది. అన్ని హంగులతో కళ్లు మెరిసేలా ఉంటుందని అనుకుంటాం.కానీ ఇంటి లోపలికి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటీ అంత అందంగా ఉందనుకుంటున్నారా? కానేకాదు.

ఈ ఇంట్లో ఒక్కటంటే ఒక్క రూమ్ కూడా లేదు. బయటనుంచి చూస్తే కనిపించే కిటికీలు కిటికీలే కాదు.బయటకు పెద్ద పెద్ద గాజు కిటికీలున్నట్లు కనిపిస్తుంది కానీ అలా లోపలికి వెళ్లి చూస్తే అవి కిటికీలే కాదని అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అదొక గోడౌన్ లా ఉంటుంది.ఇక ఈ ఇంటి మొత్తం మీద ఓ గ్లాస్‌ సెక్యూరిటీ విండో ఉంటుంది. ప్రతి గది బూడిద రంగు కార్పెట్‌తో కవర్‌ చేసి ఉంటుంది. మొత్తం ఇల్లంతా ఓ గోడౌన్‌లాగా కనిపించే ఈ వింత ఇల్లు 2000 సంత్సరంలో కట్టారు.

దీన్నిప్పుడు అమ్మకానికి పెట్టారు. ఈ ఇంటిలో కాపురం ఉండటానికి పనికొచ్చేలా లేదు. పెద్ద మొత్తంలో వైన్‌ దాచుకోవడానికి.. లేదా ఎక్కువ సంఖ్యలో కార్లను, ఆర్ట్‌ కలెక్షన్‌ను దాచుకోవడానికైతే బాగా సెట్ అయ్యేలా ఉంది.ఈ ఇంటిని అనుసంధానిస్తూ రెండు విద్యుత్ గ్రిడ్‌లు, రెండు డీజిల్ ఇంధన ట్యాంకుల ద్వారా నడిచే సహజ వాయువు జనరేటర్ కూడా ఉన్నాయి. ఇంత భారీ రేటు ధర ఉన్న ఈ వింత ఇంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఇంటి గురించి రెండు మూడు మాటల్లో చెప్పాలంటే..నాలుగు గోడలు, పైన ఓ కప్పు అంతకు మించి ఈ ఇంటిలో ఎటువంటి స్పెషాలిటీ లేనేలేదు. ఇటువంటి ఇల్లు ఏకంగా రూ.7.4 కోట్లా అంటున్నారు దీని గురించి తెలిసినవారు.ఇల్లు చూస్తే కంగారు..ధర వింటే బేజారుగా ఉంది ఈ ఇంటి తీరు చూస్తే అంటున్నారు నెటిజన్లు.