Gaddalakonda Ganesh : ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ పాటకు వ్యూస్ వెల్లువ..
నటనభూషణ శోభన్ బాబు, అతిలోక సుందరి శ్రీదేవి నటించిగా సూపర్ హిట్ అయిన ‘దేవత’ చిత్రంలోని ‘ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో’ సాంగ్‌ను ఈ సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే..
Gaddalakonda Ganesh: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన సినిమా ‘గద్దలకొండ గణేష్’.. రిలీజ్‌కి ముందు ‘వాల్మీకి’ గా టైటిల్ మార్చారు. నటనభూషణ శోభన్ బాబు, అతిలోక సుందరి శ్రీదేవి నటించిగా సూపర్ హిట్ అయిన ‘దేవత’ చిత్రంలోని ‘ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో’ సాంగ్‌ను ఈ సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే.
THIS is why I go the extra mile to do what I do…to watch you forget all your worries,enjoy and DANCE like this in the theatres…the sleepless nights, the travelling, the standing in the scorching sun to make movies,You make it WORTH IT. THANK YOU. #ElluvochiGodaramma ❤️ Love u pic.twitter.com/WM498vsNae
— Pooja Hegde (@hegdepooja) September 21, 2019
ఈ పాటకు థియేటర్లలో ఫ్యాన్స్, ఆడియెన్స్ రచ్చ రచ్చ చేశారు. ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ పాటకు ఫ్యాన్స్ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారంటూ పూజా హెగ్డే 2019 సెప్టెంబర్‌లో ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ హంగామా చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. అప్పట్లో గోదావరి ఒడ్డున భారీ సంఖ్యలో బిందెలతో ఈ పాటను షూట్ చేశారు.
Thank you sooo much sir ???? https://t.co/at1IOUbcbF
— Pooja Hegde (@hegdepooja) October 14, 2019
ఎస్పీ బాలు, పి.సుశీల పాడిన ఈ పాటను మిక్కీ జె.మేయర్ రీమిక్స్ చేశారు. ఈ వీడియో సాంగ్ రీసెంట్గా 100 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. 2.5 మిలియన్లకు పైగా లైక్స్ రావడం విశేషం. శోభన్ బాబు, శ్రీదేవి వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు పరవశించి పోయారు. వరుణ్ తేజ్, పూజాల గెటప్స్, కెమిస్ట్రీ బాగుంటుంది. ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో, యానాం దగ్గర ఇసుక తిన్నెలపై సెట్ వేసి 5 రోజుల పాటు చిత్రీకరించారు.