Womens T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం వేడుక.. టీవీ, ఓటీటీల్లో ఎక్కడ చూడొచ్చంటే?
నేటి (శుక్రవారం జూన్ 12) నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ 2026 (Womens T20 World Cup 2026) ప్రారంభం కానుంది.
Where to watch womens T20 World Cup opening ceremony
- నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్
- కప్పు కోసం 12 జట్ల మధ్య పోటీ
- తొలి మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీ
Womens T20 World Cup 2026 : క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. నేటి (శుక్రవారం జూన్ 12) నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో శ్రీలంక తలపడనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనినీ నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 నుంచి 10.45 గంటల మధ్య జరగనుంది. ఇక మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ మెగాటోర్నీలో 12 జట్లు కప్పుకోసం పోటీపడనున్నాయి. వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు గ్రూప్-1లో ఉన్నాయి. ఇక గ్రూప్-2లో ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి.
*Rohit Sharma : అఫ్గాన్‌తో తొలి వన్డే.. అరుధైన రికార్డు పై రోహిత్ శర్మ కన్ను..
రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో టోర్నీ జరగనుంది. అంటే.. ప్రతి గ్రూప్‌లోని ఓ జట్టు మిగిలిన ఐదు జట్లతో ఒక్కొ మ్యాచ్ ఆడనుంది. ఆ తరువాత ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. లీగ్ దశలో 30 మ్యాచ్‌లు ఉంటాయి. ఇక తొలి సెమీఫైనల్ మ్యాచ్ జూన్ 30న, రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జూలై 2న జరగనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ జూలై 5న జరగనుంది.
ఆస్ట్రేలియా అత్యధికంగా ఆరు సార్లు (2010, 2012, 2014, 2018, 2020, 2026) టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆ తరువాత ఇంగ్లాండ్ (2009), వెస్టిండీస్ (2016), న్యూజిలాండ్ (2024) లు ఒక్కొసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నాయి. ఇక భారత జట్టు ఇప్పటి వరకు ఒక్క సారి కూడా టీ20 ప్రపంచకపప్ను నెగ్గలేదు.
ఎక్కడ చూడొచ్చు..?
ఈ టోర్నీ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ సొంతం చేసుకుంది. దీంతో మ్యాచ్‌లను టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో వీక్షించవచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే జియో హాట్ స్టార్‌లో మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.
ఇక ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ వేదిక.
