Balochistan: 100 అడుగులలోతు లోయ‌లో ప‌డ్డ వ్యాను.. 22 మంది మృతి

పాకిస్థాన్‌లోని బ‌లూచిస్థాన్‌లో బుధ‌వారం ఉద‌యం ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుని 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రి కొంద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి.

Balochistan: 100 అడుగులలోతు లోయ‌లో ప‌డ్డ వ్యాను.. 22 మంది మృతి

Accident

Updated On : June 8, 2022 / 4:04 PM IST

Balochistan: పాకిస్థాన్‌లోని బ‌లూచిస్థాన్‌లో బుధ‌వారం ఉద‌యం ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుని 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రి కొంద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. కిల్లా సైఫుల్లా జిల్లాలోని అఖ్త‌ర్‌జై ప్రాంతం మీదుగా ప్ర‌యాణికుల‌తో ఓ వ్యాను వెళుతోన్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. కొండ‌ల్లో డ్రైవ‌రు వ్యానును స‌రిగ్గా న‌డ‌ప‌క‌పోవ‌డ‌మే ఈ ప్ర‌మాదం జ‌ర‌డ‌గానికి కార‌ణ‌మ‌ని అధికారులు తెలిపారు. లోరాలాయి ప్రాంతం నుంచి ఝోబ్ జిల్లాకు ఆ వ్యాను వెళుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని వివ‌రించారు.

Bihar: బిహార్‌లో నిర్భ‌య త‌ర‌హా ఘ‌ట‌న‌.. బ‌స్సులో బాలిక‌పై గ్యాంగ్ రేప్

ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతంలో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని వివ‌రించారు. ఇప్ప‌టివ‌ర‌కు 10 మృత‌దేహాల‌కు బ‌య‌ట‌కు తీశామ‌ని వివ‌రించారు. చాలా లోతైన లోయ కావ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం క్లిష్టంగా మారింద‌ని చెప్పారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వారికి ఆసుప‌త్రులకు త‌ర‌లించేందుకు ప్ర‌మాద‌స్థ‌లికి అంబులెన్సులను ర‌ప్పించామ‌ని అధికారులు చెప్పారు. కాగా, కొండ ప్రాంతాల కార‌ణంగా ప్ర‌తి ఏడాది బ‌లూచిస్థాన్‌లో ప్ర‌మాదాలు చోటు చేసుకుని వంద‌లాది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు.