18 నెలల తర్వాత..కశ్మీర్ లో హైస్పీడ్ 4G సేవల పునరుద్దరణ

4G 18 నెలల తర్వాత జమ్మూ కశ్మీర్ లో హై స్పీడ్ 4జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించారు. ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి శుక్రవారం(ఫిబ్రవరి-5,2021)ఈ విషయాన్ని సృష్టం చేశారు.
2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ -370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జమ్మూకశ్మీర్ లో ఎటువంటి అల్లర్లు జరగకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా 4జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలను కేంద్రం ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత 4జీ సేవలపై నిషేధాన్ని పొడిగిస్తూ వచ్చింది ప్రభుత్వం. అయితే కొద్ది నెలల క్రితం దమ్‌పూర్, గండేర్‌బాల్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించారు.మిగిలిన 18 జిల్లాల్లో మాత్రం పునరుద్దరించలేదు. తాజాగా అన్ని జిల్లాల్లో 4జీ సేవలను పునరుద్దరించినట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి.