Crane Falls Off Bridge: కాల్వలో పడ్డ ట్రక్కు.. పైకి లాగబోయి కుప్పకూలిన క్రేన్.. వీడియో వైరల్

ప్రమాదవశాత్తు కాల్వలో పడిన ట్రక్కును పైకిలాగబోయి క్రెయిన్ ఒక్కసారిగా అదే కాల్వలో కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఒడిశాలోని తాల్చేర్ పట్టణంలో చోటు చేసుకుంది.

Crane Falls Off Bridge: కాల్వలో పడ్డ ట్రక్కు.. పైకి లాగబోయి కుప్పకూలిన క్రేన్.. వీడియో వైరల్

Crane Falls Off Bridge

Updated On : August 5, 2022 / 10:09 AM IST

Crane Falls Off Bridge: ప్రమాదవశాత్తు కాల్వలో పడిన ట్రక్కును పైకిలాగబోయి క్రేన్ ఒక్కసారిగా అదే కాల్వలో కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఒడిశాలోని తాల్చేర్ పట్టణంలో చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మాత్రం ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. క్రేన్ కాల్వలో కుప్పకూలే సమయంలో క్యాబిన్ లో డ్రైవర్ ఉన్నాడు.  కాల్వలో పడిన అతను ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు.

Road Accident : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి

ఒడిశాలోని తాల్చేర్ పట్టణంలో ఓ బ్రిడ్జి పై నుంచి ట్రక్కు పెద్ద కాల్వలో పడిపోయింది. దీనిని బయటకు తీసేందుకు రెండు క్రేన్ లను అధికారులు తెచ్చారు. వంతెన పై నుంచి వైర్ల సహాయంతో రెండు క్రేన్లు ట్రక్కును లాగే ప్రయత్నం చేశాయి. కాల్వ నీటిలో ఉన్న వాహనాన్ని జాగ్రత్తగా పైకిలాగుతున్న క్రమంలో ఓ క్రేన్ వైర్లు తెగిపోయి అదే బ్రిడ్జి పై నుంచి కాల్వల్లో కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో క్యాబిన్ లో డ్రైవర్ ఉండిపోయాడు.. అయితే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్వలో పడిన క్రేన్ నుంచి బయటకొచ్చి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

https://www.youtube.com/watch?v=pbD5pPTRW_4&t=8s

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కాల్వలో క్రేన్ కుప్పకూలుతున్న వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్లు చేస్తున్నారు.