అనసూయని ఆనందంలో ముంచెత్తిన అభిమాని!

Anchor Anasuya Bharadwaj: స్టార్ యాంకర్ అనసూయకి ఆమె ఫ్యాన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.. అనసూయ ఆల్‌మోస్ట్ మర్చిపోయిన ఓ రేర్ పిక్‌తో ఆ అభిమాని ఆమెను ఆశ్చర్యపోయేలా చేశాడు. టీవీ షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది అనసూయ..
View this post on Instagram
రీసెంట్‌గా అనసూయ ఆమె శ్రీవారు సుశాంక్ భరద్వాజ్ ఇద్దరూ ఎన్‌సీసీ టైంలో తీసుకున్న ఫొటోలను సదరు ఫ్యాన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు.. ఈ పిక్ చూసి అనసూయ ఆనందంతో కూడిన ఆశ్చర్యానికి లోనైంది. ‘ఓ మై గాడ్.. ఈ ఫొటో నీకెక్కడ దొరికింది?’.. మా ఇద్దరి లైఫ్ అక్కడే స్టార్ట్ అయింది’.. అంటూ తమ ప్రేమకు బీజం పడిన సందర్భం అదేనంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
కాగా ఎన్‌సీసీ సమయంలోనే అనసూయ, పాట్నాకు చెందిన సుశాంక్‌తో లవ్‌లో పడింది. ఇద్దరు ఓకే అనుకున్నాక అనసూయ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు.. తన తర్వాత ఇంకో ఇద్దరు ఆడపిల్లలున్నారు.. వారి ఫ్యూచర్ ఏంటని పేరెంట్స్ కంగారు పడ్డారు.. కట్ చేస్తే 9 సంవత్సరాల తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో సుశాంక్, అనసూయ ఏడడుగులేశారు. వీరికి ఇద్దరు బాబులు సంతానం..
View this post on Instagram