రైళ్ల బోగీల మధ్య కప్లింగ్‌లపై కూర్చుని ప్రయాణిస్తున్న బాలిక..!! చూసి షాక్ అయిన అధికారులు

  • Published By: nagamani ,Published On : December 14, 2020 / 12:16 PM IST
రైళ్ల బోగీల మధ్య కప్లింగ్‌లపై కూర్చుని ప్రయాణిస్తున్న బాలిక..!! చూసి షాక్ అయిన అధికారులు

Updated On : December 14, 2020 / 12:21 PM IST

UP 14 year lalitpur girl goods trains couplings : రైలు బోగీల మధ్య ఉండే కప్లింగ్ లపై కూర్చుని ఉన్న బాలికను చూసిన రైల్వే సిబ్బంది షాక్ అయ్యారు. రెండు బోగీల మధ్య ఎవరో ఉన్నట్లుగా అనిపించగా రైల్వే సిబ్బంది బాగా పరీక్షగా చూడగా అక్కడ కప్లింగ్ పై ఓ బాలిక గుర్తించి షాక్ అయ్యారు. రైలు ప్రయాణిస్తుండగా అక్కడ నుంచి పడితే పరిస్థితి ఏంటని భయపడ్డారు.

వెంటనే ఆ బాలిక దగ్గరకెళ్లి దింపేశారు. కానీ వారికి తెలీదు ఆ బాలిక ఆగి ఉన్న రైలు మధ్యనే కాదు ఆ రైలు స్పీడ్ గా ప్రయాణిస్తున్న సమయంలో కూడా గత 10రోజులుగా కప్లింగ్ ల మధ్య కూర్చుని ప్రయాణిస్తోంది. అదే విషయం ఆ బాలిక చెప్పగా విని షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళితే యూపీలోని లలిత్‌పూర్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై ఆగివున్న గూడ్సు రైలు కప్లింగ్‌పైకి ఎక్కికూర్చుంది. ఈ విషయాన్ని శుక్రవారం (డిసెంబర్ 11,2020) కాన్పూర్ స్టేషన్ వద్ద ఆర్పీఎఫ్ సిబ్బందికి గమనించారు. గబగబా ఆమె దగ్గరకెళ్లి..నీ పేరేంటీ? ఇక్కడెందుకు కూర్చున్నావు? అని ప్రశ్నించారు. దానికి ఆ బాలిక నా పేరు నేహ, మాది గణెష్‌పూర్ గ్రామం అని చెప్పింది.

అంతేకాదు తాను గత 10 రోజుల నుంచి ఇలాగే పలు రైళ్ల కప్లింగ్‌లపై కూర్చుని ఆ రైళ్లు ఎక్కడికెళ్లితే అక్కడ తిరుగుతున్నానని చెప్పింది. దీంతో వారు షాక్ అయ్యారు. వెంటనే ఆ బాలిక తండ్రి ఫోన్ నంబరు అడిగి తెలుసుకుని అతనితో సమాచారం అందించారు. ఫోనులో మాట్లాడిన తండ్రి తన కూతురు మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు.

డిసెంబరు ఒకటి నుంచి కనిపించట్లేదనీ..తాము చాలా చోట్ల వెతికామని కానీ ఫలితం లేదని తెలిపాడు. దీంతో తన కుమార్తె ఆచూకీ తెలియటంతో ఆ తండ్రి ఆనందంగా కాన్పూర్ చేరుకుని, తమతో పాటు కుమార్తెను తీసుకువెళ్లారు.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గణెష్‌పూర్ గ్రామానికి చెందిన రామ్‌జీవన్ కుమార్తె నేహ. వయస్సు 14ఏళ్లు. డిసెంబరు ఒకటిన గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై నిలిచివున్న గూడ్సురైలు కప్లింగ్‌లపైకి ఎక్కికూర్చుంది. ఇంతలో ఆ గూడ్సు రైలు ముందుకు కదిలింది. కుమార్తె కనిపించకపోవడంతో ఇంటిలోని వారు ఈ విషయమై డిసెంబరు 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా ఆ బాలిక కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద ఆర్పీఎఫ్ సిబ్బందికి కనిపించింది. ఆ బాలిక వారికి తాను ఎక్కడ గూడ్సు రైలు ఎక్కిందీ, ఆ తరువాత ఏం జరిగిందనే విషయాలను తెలిపింది. తాను ఎక్కిన గూడ్సు ఆగిపోగానే మరో గూడ్సు రైలు కప్లింగ్ ఎక్కికూర్చున్నానని..ఇలా అనేక గూడ్సు రైళ్ల కప్లింగ్‌లు ఎక్కుతూ ఇక్కడకు వచ్చానని చెప్పింది.

ఆకలేసినప్పుడు ఏదైనా స్టేషన్ లో దిగి..కనిపించినవారిని,ప్రయాణికులను ఆహారం అడిగి తినేదానినని..తిరిగి మళ్లీ ఆగి ఉన్న రైలు కప్లింగ్ పై కూర్చుని అది ఎక్కడికి వెళితే అక్కడికి తిరుగుతున్నానని చెప్పిందని తెలిపారు. అలా ఆ బాలిక గత 10రోజుల నుంచి పలు రైళ్లు ఎక్కి తిరుగుతుండేదని కానీ సిబ్బంది చూడటంతో బైటపడిందనీ..ఆ బాలికను ఆమె తండ్రికి అప్పగించామని తెలిపారు.