Enforcement Directorate: ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌కు 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ

న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ ఎదుర్కొంటోన్న ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌కు 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణ‌యం తీసుకుంది.

Enforcement Directorate: ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌కు 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ

Updated On : June 13, 2022 / 1:46 PM IST

Enforcement Directorate: న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ ఎదుర్కొంటోన్న ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ను 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణ‌యం తీసుకుంది. న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో స‌త్యేంద‌ర్ జైన్ 2017 నుంచి విచార‌ణ ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. 2015-16లో కోల్‌క‌తాలోని స‌త్యేంద‌ర్ జైన్ సంస్థ‌లకు సంబంధించిన‌ న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసుల్లో ఆయ‌న‌ ఈడీ విచార‌ణ ఎదుర్కొంటున్నారు.

prophet row: విచార‌ణ‌కు రావ‌డానికి స‌మ‌యం ఇవ్వండి: నురూప్ శ‌ర్మ‌

ఆయ‌న‌ను మే 30న అరెస్టు చేశారు. జూన్ 7న స‌త్యేంద‌ర్ జైన్ ఇళ్లు, కార్యాల‌యాల్లో దాడులు చేసిన ఈడీ ప‌లు ప‌త్రాలు, డిజిట‌ల్ రికార్డుల‌ను స్వాధీనం చేసుకుంది. దాదాపు రూ.2 కోట్ల న‌గ‌దు. 1.8 కిలోల బంగారాన్ని కూడా సీజ్ చేసింది. విచార‌ణకు స‌త్యేంద‌ర్ జైన్ స‌హ‌క‌రించ‌ట్లేద‌ని కోర్టుకు ఈడీ అధికారులు చెప్పారు. కాగా, మే 31 నుంచి జూన్ 9వ‌ర‌కు స‌త్యేంద‌ర్ జైన్ ఈడీ క‌స్ట‌డీలో ఉన్నారు. అనంత‌రం ఆ క‌స్ట‌డీని కోర్టు మ‌రో నాలుగు రోజులు పొడిగించింది. నేటితో ఈడీ క‌స్ట‌డీ ముగియ‌డంతో జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి అప్ప‌గించింది.