Actress Kavitha Son : నటి కవిత ఇంట విషాదం.. కరోనాతో పోరాడుతున్న భర్త.. కుమారుడు మృతి..

సీనియర్ నటి కవిత కుమారుడు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోగా.. భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది..

Actress Kavitha Son : నటి కవిత ఇంట విషాదం.. కరోనాతో పోరాడుతున్న భర్త.. కుమారుడు మృతి..

Actress Kavitha

Updated On : June 18, 2021 / 5:17 PM IST

Actress Kavitha Son: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌తో మరింత ఉదృతంగా వ్యాపిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే పలు రంగాలకు చెందిన సినీ ప్రముఖులు కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు పోరాడి బయటపడ్డారు.

తాజాగా టాలీవుడ్‌లో ఓ సీనియర్ నటి కుమారుడు కోవిడ్ కారణంగా మరణించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన కవిత కుమారుడు సంజయ్ రూప్ కరోనా సోకడంతో కొద్ది రోజులుగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. రీసెంట్‌గా కోవిడ్‌తో పోరాడుతూ కన్నుమూశారు.

కవిత భర్త కూడా కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. కరోనా మహమ్మారితో కొడుకు కన్నుమూయడం, భర్త ఆరోగ్యం ఆందోళనగా ఉండడంతో కవిత తీవ్ర విషాదంలో ఉన్నారు.