Naira Shah : బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ‘బుర్రకథ’ బ్యూటీ నైరా షా అరెస్ట్..
డ్రగ్స్ కేసులో హీరోయిన్ నైరా షా ను ముంబైలో NCB అధికారులు అరెస్ట్ చేశారు.. నైరా షా తెలుగులో ఆది సాయికుమార్ పక్కన ‘బుర్రకథ’ సినిమాలో యాక్ట్ చేసింది..

Naira Shah
Naira Shah: యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో బాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. పలువురు సెలబ్రిటీల పేర్లు బయటకొచ్చాయి. కొంతమందిని విచారించారు. సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తితో సహా కొందరిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు.
డ్రగ్స్ కేసులో హీరోయిన్ నైరా షా ను ముంబైలో NCB అధికారులు అరెస్ట్ చేశారు. నైరా షా తెలుగులో ఆది సాయికుమార్ పక్కన ‘బుర్రకథ’ సినిమాలో యాక్ట్ చేసింది. నైరా షా తో పాటు ఆమె ఫ్రెండ్ ఆషిక్ సాజిద్ హుస్సేన్ ను కూడా అరెస్ట్ చేశారు.
జూన్ 13 (ఆదివారం) అరెస్ట్ కాగా ఈ వార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. స్నేహితుడి కలిసి తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్న తర్వాత హోటల్ రూంకి వెళ్లి డ్రగ్స్ తీసుకున్నారు. తెల్లవారు జామున 3 గంటలకు పోలీసులు వారి రూం చెక్ చెయ్యగా డ్రగ్స్ దొరికాయి. దీంతో నైరాతో పాటు ఆమె ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎన్‌సీబీ అధికారులు.