‘దేవి’ ప్రేమ ఇప్పుడెలా ఉందో చూశారా!

  • Published By: sekhar ,Published On : December 8, 2020 / 04:12 PM IST
‘దేవి’ ప్రేమ ఇప్పుడెలా ఉందో చూశారా!

Updated On : December 8, 2020 / 4:33 PM IST

Actress Prema: తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి ప్రేమ.. కన్నడ నటి అయినా చూడగానే ఆకట్టుకునే రూపం, చక్కటి చిరునవ్వుతో తెలుగు అమ్మాయిలా కనిపించేవారు. చాలా కాలం తర్వాత ఆమె ఫొటోలు కన్నడ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

మోహన్ లాల్, విష్ణు వర్థన్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర, సాయి కుమార్, మోహన్ బాబు, వెంకటేష్ వంటి స్టార్స్‌తో యాక్ట్ చేసిన ప్రేమ ‘దేవి’, ‘దేవిపుత్రుడు’ వంటి భక్తిరస చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.

Prema

వెంకటేష్ ‘ధర్మచక్రం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. 1994 నుండి 2009 వరకు 15 ఏళ్ల పాటు నటిగా కొనసాగిన తర్వాత జీవన్ అప్పాచుని వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. వీరి వైవాహిక జీవితంలో విబేధాల కారణంగా 2016లో ఆమె విడాకులకు అప్లై చేశారు.

కొంత గ్యాప్ తర్వాత కన్నడలో ఉపేంద్ర పక్కన ‘ఉపేంద్ర మాట్టే బా’ అనే సినిమాలో నటించారు. 2017 లో ఈ సినిమా విడుదలైంది. ‘ఢీ, చిరునవ్వుతో, నువ్వేకావాలి, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమతో రా, రాయలసీమ రామన్నచౌదరి’ వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే రెండు తమిళ్, రెండు మలయాళ చిత్రాల్లోనూ కనిపించారు ప్రేమ.

Prema

Prema

Prema