Sanjjanaa Galrani Marriage : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సంజన..!
సంజన, కర్ణాటకకు చెందిన డాక్టర్ అజీజ్ పాషాను పెళ్లి చేసుకుంది..

Actress Sanjjanaa Galrani Opens About Her Secret Marriage With Doctor Azeez Pasha
Sanjjanaa Galrani Marriage: గతేడాది కరోనా టైంలో పలువురు సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే.. ఇప్పుడీ లాక్‌డౌన్ సమయంలో హీరోయిన్లు సీక్రెట్‌గా మ్యారేజెస్ చేసుకుని ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఈమధ్యే ప్రణీత సుభాష్ బిజినెస్ మెన్ నితిన్ రాజ్‌ను రహస్యంగా పెళ్లాడింది..
Pranitha Subhash : హీరోయిన్ ప్రణీత.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది..!
రీసెంట్‌గా ‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన కూడా సీక్రెట్ మ్యారేజ్ చేసుకుని సడెన్‌గా షాకిచ్చింది.. మొన్నటివరకు కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకుంటూ వార్తల్లో నిలిచిన సంజన, కర్ణాటకకు చెందిన డాక్టర్ అజీజ్ పాషాను పెళ్లి చేసుకుంది..
Sanjjanaa Galrani : సినీ కార్మికులకు హీరోయిన్ సంజన సాయం..
ఇంకో హైలెట్ ఏంటంటే.. అజీజ్ పాషాతో సంజన పెళ్లి గతేడాది లాక్‌డౌన్ టైంలోనే అయిపోయింది.. ఈ విషయాన్ని ఇన్నాళ్లూ సీక్రెట్‌గా ఉంచి, ఇప్పుడు రివీల్ చెయ్యడానికి రీజన్ ఏంటో కూడా చెప్పింది సంజన.. ‘‘పెళ్లి కుదిరాక ఆ గుడ్ న్యూస్‌ను ఇండస్ట్రీ వాళ్లతో షేర్ చేసుకుందామనుకునే లోగా డ్రగ్స్ కేసులో పలు ప్రాబ్లమ్స్ ఫేస్ చెయ్యాల్సి వచ్చింది.. తర్వాత అందర్నీ పిలిచి గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చెయ్యాలనుకున్నాం కానీ లాక్‌డౌన్ వల్ల కుదరలేదు’’ అని చెప్పుకొచ్చింది సంజన గల్రానీ..