Sanjjanaa Galrani : సినీ కార్మికులకు హీరోయిన్ సంజన సాయం..

‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహరం, శాండల్‌వుడ్ సినీ కార్మికుల కుటుంబాలకు తాను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను సహాయంగా పంపిణీ చేశారు..

Sanjjanaa Galrani : సినీ కార్మికులకు హీరోయిన్ సంజన సాయం..

Sanjjanaa Galrani

Sanjjanaa Galrani: ‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహరం, శాండల్‌వుడ్ సినీ కార్మికుల కుటుంబాలకు తాను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను సహాయంగా పంపిణీ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by SANJJANAA GALRANI. (@sanjjanaagalrani)

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘కోవిడ్‌ భాదితులు మెరైగన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలు పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. తమ జీవితాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌తో పాటుగా కోవిడ్‌ కట్టడిలో భాగస్వామ్యులైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాస్కులు ధరించడం, ప్రతిరోజు శానిటైజ్‌ చేసుకోవడం, భౌతికదూరం పాటించండి.. ఇలా కోవిడ్‌ నియంత్రణ చర్యలను చేపట్టడం వల్లనే ఈ ప్రపంచం కోవిడ్‌ మహమ్మారినుంచి బయటపడుతుంది.

నేను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా ఉడతా భక్తిగా మే 10 నుండి మీ ఇంటి సెల్లార్‌లోనే వంట వండించి రోజు 500 మంది రెండు పూటలా వెజిటబుల్ బిర్యానీ, పెరుగన్నం, పులిహోర, బిస్మిల్లా బాత్, ఇలా రోజు మెనూ మారుస్తూ పేదవారికి ఆహరం అందిస్తున్నాను. అదేవిధంగా లాక్‌డౌన్ కారణంగా రోజు వారి కూలికి పనిచేసే సినీ పరిశ్రమకు చెందిన లైట్ బాయ్స్ , ప్రొడక్షన్ ఫోర్త్ క్లాస్ కార్మికులకు 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులను జూన్ 2న అందించాను. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సహాయాలను కొనసాగిస్తాను.. దయచేసి అందరు ఇంట్లోనే ఉడండి.. కోవిడ్‌ నియంత్రణ చర్యలను పాటించండి. పాజిటివ్‌గా ఉండండి కానీ కోవిడ్‌ పాజిటివ్‌ తెచ్చుకోకండి’’ అని పేర్కొన్నారు..